అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pak Movies ban | ఉగ్రదాడి ఘటనపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రరోక్షంగా పాక్‌ను చావుదెబ్బ కొట్టేలా వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్న మోదీ సర్కారు.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్‌కు చెందిన సినిమాలపై(Ban on pak movies) భారత్‌లో బ్యాన్ విధించింది. ఇకపై పాకిస్థాన్‌కు చెందిన సినిమాలు, నటులపై నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్‌కు చెందిన పలు సినిమాలకు(Pak movies) భారత్‌లోనూ ఆదరణ ఉంది. కాగా.. కశ్మీర్‌లోని పహల్గావ్‌లో ఉగ్రవాదులు(pahalgam terrorist attack) మారణహోమం సృష్టించిన తర్వాత కేంద్రం అత్యంత కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఆ దేశంతో దౌత్య సంబంధాలు(Diplomatic relations) కట్ చేయడమే కాకుండా.. వీసాలను సైతం నిలిపివేసింది. అలాగే అక్కడి పౌరులు భారత్ విడిచి వెళ్లిపోవాలని సూచించింది. పాక్ సినిమాలు(Pakistan movies) సైతం భారత్‌లో ఇకపై ఆడబోవని కేంద్రం(Union government) స్పష్టం చేసింది. దీంతో పరోక్షంగా ఆ దేశంలోని సినిమా రంగం(Movie industry)పై తీవ్ర ప్రభావం చూపనుంది.