అక్షరటుడే, వెబ్‌డెస్క్:America Colleges | అమెరికాలోని పలు కాలేజీలు మళ్లీ బ్లూ బుక్స్(Blue Books) తీసుకు రావాలని యోచిస్తున్నాయి. ప్రస్తుతం సాంకేతికత రోజు రోజుకు పెరిగిపోతుంది. పాఠశాల విద్యార్థుల (School students) నుంచి మొదలు పెడితే పీహెచ్డీ స్కాలర్స్ వరకు అందరూ ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. అసైన్మెంట్లు, ఇతర ప్రాజెక్ట్ వర్క్‌ల కోసం పాఠశాల విద్యార్థులు ఇంటర్నెట్(Internet) ఆశ్రయిస్తున్నారు. పలువురు పీహెచ్డీ స్కాలర్స్ కూడా తమ థీసిస్‌ను నెట్లో నుంచి కాపీ కొడతారనే ఆరోపణలు ఉన్నాయి.
America Colleges | ఏఐ యుగంలో..
ప్రస్తుతం మనం ఏఐ(AI) యుగంలో ఉన్నాం. గతంలో విద్యార్థులు అసైన్మెంట్ కాపీ చేయాలన్నా.. విద్యార్థులు ఆన్లైన్లో శోధించాల్సిన అవసరం ఉండేది. కానీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence)కు ఇన్పుట్ ఇస్తే చాలు. అదే అసైన్మెంట్ వర్క్ రెడీ చేసి పెడుతోంది. దీంతో విద్యార్థుల్లో సృజనాత్మకత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ క్రమంలో అమెరికాలోని పలు కాలేజీలు మళ్లీ బ్లూ బుక్స్ తీసుకు వస్తున్నాయి.
America Colleges | మోసం చేయకుండా ఉండటానికి..
ఏఐ వినియోగం పెరిగిన తర్వాత అసైన్మెంట్, ప్రాజెక్ట్‌ల కోసం విద్యార్థులు దానిపైనే ఆధార పడుతున్నారు. ఏఐ సాయంతో విద్యార్థులు (Students) చీటింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించిన యూనివర్సిటీలు(Universities of America) మళ్లీ బ్లూ బుక్స్ తీసుకు వస్తున్నాయి. ఇందులోనే అసైన్మెంట్లు రాయించడం, పరీక్షల నిర్వహణ చేపట్టనున్నాయి. దీంతో విద్యార్థుల చేతి రాత కూడా మెరుగవుతుందని ప్రొఫెసర్లు భావిస్తున్నారు.
America Colleges | బ్లూ బుక్ అంటే..
విద్యార్థులు తమ హోంవర్క్ చేయడానికి కంప్యూటర్లను ఉపయోగిస్తున్నారని పలువురు ప్రొఫెసర్లు(Professors) పేర్కొన్నారు. దీంతోనే బ్లూ బుక్స్ తీసుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా బ్లూ బుక్స్ అనేవి సరళమైన, స్టేపుల్ చేయబడిన పరీక్షా బుక్‌లెట్‌లు. పైన నీలిరంగు అట్టలతో ఉండటం మూలంగా వీటిని బ్లూ బుక్స్ అంటారు. 20 శతాబ్దం ప్రారంభంలో అమెరికా(America)లో వీటిని ప్రవేశ పెట్టారు. పరీక్షల నిర్వహణ, అసైన్మెంట్, హోం వర్క్‌కు వీటినే ఉపయోగించేవారు. అయితే సాంకేతికత ఇటీవల హోం వర్కులు కూడా డిజిటల్ విధానంలో చేయడం ప్రారంభించారు. అయితే విద్యార్థులు ఏఐ సాయంతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన యూనివర్సిటీలు మళ్లీ బ్లూ బుక్స్ తీసుకువస్తున్నాయి.