More
    Homeఅంతర్జాతీయంMiss World 2025 | నేడే మిస్ వ‌ర‌ల్డ్ ఫైన‌ల్స్.. విజేత‌కి ఎన్ని కోట్ల ప్రైజ్...

    Miss World 2025 | నేడే మిస్ వ‌ర‌ల్డ్ ఫైన‌ల్స్.. విజేత‌కి ఎన్ని కోట్ల ప్రైజ్ మ‌నీ అంటే..!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: miss world 2025 finals in hyderabad : హైదరాబాద్‌లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు ఘనంగా ప్రారంభం కాగా, మే 31న హైటెక్స్ HITEX ఎగ్జిబిషన్ సెంటర్‌లో గ్రాండ్ ఫినాలే జరగబోతోంది.

    ఈ పోటీలు, దాదాపు మూడు వారాల పాటు వివిధ కార్యక్రమాలు, ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించాయి. బాలీవుడ్ తారల ప్రదర్శనలు, విశిష్ట అతిథుల సమక్షంలో ఈ సాయంత్రం ప్రపంచ సుందరి కిరీటం ఎవరిని వరించనుంది తెలిసిపోతుంది. 108 దేశాల నుండి వచ్చిన అందాల భామలు ఈ కిరీటం కోసం పోటీ పడుతున్నారు. వీరిలో మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఉన్నారు.

    Miss World 2025 : అంగ‌రంగ వైభ‌వంగా..

    మిస్ వరల్డ్ పోటీ కేవలం అందం, శారీరక కొలతలకు మాత్రమే పరిమితం కాదు. ఇందులో అనేక విభిన్నమైన పోటీలు ఉంటాయి.

    • స్పోర్ట్స్ ఛాలెంజ్(Sports Challenge): క్రీడా ప్రతిభను ప్రదర్శించే విభాగం.
    • టాలెంట్ ఛాలెంజ్(Talent Challenge): సంగీతం, కళలు, నృత్యం వంటి విభాగాల్లో తమ నైపుణ్యాన్ని చూపుతారు.
    • హెడ్ టు హెడ్ ఛాలెంజ్(Head to Head Challenge): మేధస్సు, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి ఈ విభాగంలో పరీక్షిస్తారు.
    • టాప్ మోడల్ ఛాలెంజ్(Top Model Challenge): ఫ్యాషన్ షో నిర్వహిస్తారు, ఇందులో డిజైనర్ డ్రెస్ Designer dress విభాగం కూడా ఉంటుంది.
    • బ్యూటీ విత్ ఏ పర్పస్:(Beauty with a Purpose) సామాజిక సేవకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు.
    • మల్టీమీడియా విభాగం(Multimedia Section): సోషల్ మీడియాలో వారిచ్చే సందేశాలు, ప్రభావం వంటి వాటిని పరిశీలిస్తారు. ఈ దశలన్నీ దాటిన వారే మిస్ వరల్డ్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.

    మిస్ వరల్డ్ ఛైర్‌పర్సన్ జూలియా మోర్లే (Miss World Chairperson Julia Morley) ఈ ప్రతిష్టాత్మక జ్యూరీకి నేతృత్వం వహిస్తున్నారు. జ్యూరీ సభ్యులుగా.. బాలీవుడ్ నటుడు సోనూ సూద్, సుధా రెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కెరినా టిర్రెల్ (Miss England Carina Tyrrell) వ్యవహరిస్తారు. వీరిలో సోనూ సూద్(Sonu Sood) మిస్‌వరల్డ్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డు(Miss World Humanitarian Award)ను అందజేయనున్నారు.

    మానుషి చిల్లర్ (2017 మిస్ వరల్డ్), స్టెఫానీ డెల్ (2016 మిస్ వరల్డ్) ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. ప్రజెంటర్‌గా సచిన్ కుంభార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బాలీవుడ్ స్టార్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

    ఈ గ్రాండ్ ఫినాలే 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ కానుంది. దీనికి 3,500 మంది అతిథులు హాజరవుతారు. సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈసారి మిస్‌వరల్డ్ విజేతకు ఏకంగా రూ.8.5 కోట్ల ప్రైజ్‌ మనీ లభిస్తుంది.

    Latest articles

    Summer Dance Fest | ఉత్సాహంగా సమ్మర్ డాన్స్ ఫెస్ట్.. స్టెప్పులతో అదరగొట్టిన చిన్నారులు..

    అక్షరటుడే, కామారెడ్డి: Summer Dance Fest : కామారెడ్డి జిల్లా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ (Kamareddy District Dance...

    IPL 2025 RCB vs PBK | దుమ్ము దులిపిన ఆర్సీబీ.. పంజాబ్‌కి భారీ టార్గెట్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Punjab target is 191 : ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ),...

    Shamshabad Airport | శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన..

    అక్షరటుడే, హైదరాబాద్: Shamshabad Airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు (Passengers ) ఆందోళన(passenger protest)కు దిగారు. కాసేపు...

    IPL Final | విరాట్​ కోహ్లీ అవుట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : IPL Final | ఐపీఎల్​ ఫైనల్​లో కోహ్లీ అవుట్​ అయ్యాడు. ఆర్సీబీ నాలుగు వికెట్లు...

    More like this

    Summer Dance Fest | ఉత్సాహంగా సమ్మర్ డాన్స్ ఫెస్ట్.. స్టెప్పులతో అదరగొట్టిన చిన్నారులు..

    అక్షరటుడే, కామారెడ్డి: Summer Dance Fest : కామారెడ్డి జిల్లా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ (Kamareddy District Dance...

    IPL 2025 RCB vs PBK | దుమ్ము దులిపిన ఆర్సీబీ.. పంజాబ్‌కి భారీ టార్గెట్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Punjab target is 191 : ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ),...

    Shamshabad Airport | శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన..

    అక్షరటుడే, హైదరాబాద్: Shamshabad Airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు (Passengers ) ఆందోళన(passenger protest)కు దిగారు. కాసేపు...