అక్షరటుడే, వెబ్‌డెస్క్:Ather Energy IPO |మార్కెట్ ఒడుదొడుకుల(Volatility) నేపథ్యంలో మార్కెట్‌లో ఐపీవో(Initial Public Offering)ల సందడి లేకుండా పోయింది. అంతర్జాతీయంగా ఏర్పడిన అననుకూల పరిస్థితులు, రూపాయి బలహీనపడడం, మార్కెట్లపై బేర్(Bear) పట్టు సాధించడంతో స్టాక్ మార్కెట్(Stock market) కుదేలయ్యింది.
దీంతో ఇన్వెస్టర్లు(Investors) ఆసక్తి చూపకపోవడంతో ఐపీవో(IPO)లు నిలిచిపోయాయి. ఈ నెలారంభంనుంచి మార్కెట్ కోలుకుంటుండడంతో తిరిగి ఐపీవోల సందడి మొదలవబోతోంది. మొదట ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్(Electric bike)ల తయారీ కంపెనీ అయిన ఏథర్(Ather) ఎనర్జీ ఐపీవోకు వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మెయిన్ బోర్డు నుంచి వస్తున్న తొలి ఐపీవో ఇదే కావడం గమనార్హం. కాగా విద్యుత్ వాహన విభాగంలో ఐపీవోకు వస్తున్న రెండో సంస్థ ఇది.. ఇప్పటికే ఓలా(Ola) స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన విషయం తెలిసిందే.
Ather Energy IPO | రూ. 2,980 కోట్ల సమీకరణ లక్ష్యం..
పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.2,980 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.2,626 కోట్లు ఫ్రెష్ ఇష్యూ.. ఆఫర్ ఫర్ సేల్(Offer for sale) ద్వారా ప్రమోటర్లు(Promoters) రూ.354 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను మహారాష్ట్ర(Maharashtra)లోని బైక్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు రుణభారాన్ని తగ్గించుకునేందుకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే కొంత మొత్తాన్ని రీసెర్చ్, డెవలప్‌మెంట్ సామర్థ్యాలు పెంచుకోవడానికి వినియోగించుకుంటామని పేర్కొంది. ఐపీవో సబ్‌స్క్రిప్షన్(IPO Subscription) ఈనెల 28 న ప్రారంభమై 30న ముగుస్తుంది.
Ather Energy IPO | ధరల శ్రేణి..
ధరల శ్రేణిని రూ. 304 నుంచి రూ.321 గా నిర్ణయించారు. ఒక లాట్(Lot)లో 46 షేర్లుంటాయి. ఆసక్తిగలవారు ఒక లాట్ కోసం రూ.14,766 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు(Retail Investors) 10 శాతం కోటా మాత్రమే కేటాయించారు. దీంతో ఈ ఐపీవోకు డిమాండ్ ఉండే అవకాశాలున్నాయి. కాగా కంపెనీ స్టాక్స్(Company Stocks) మే 6 వ తేదీన బీఎస్‌ఈతో పాటు ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్(List) కానున్నాయి.