More
    Homeటెక్నాలజీArtificial Blood | 2030 నాటికి కృత్రిమ రక్తం.. మెడిక‌ల్ షాప్స్‌లో కొనుక్కోవ‌చ్చు..!

    Artificial Blood | 2030 నాటికి కృత్రిమ రక్తం.. మెడిక‌ల్ షాప్స్‌లో కొనుక్కోవ‌చ్చు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Artificial Blood | మ‌న శ‌రీరం అద్భుత‌మైన యంత్రంగా చెప్ప‌వ‌చ్చు. ప్రతి అవయవానికి సక్రమంగా రక్తం (Blood) సరఫరా అయితేనే అది సక్రమంగా పనిచేస్తుంది.

    రక్తం ద్వారానే కణాలకు ఆక్సిజన్, పోషకాలు (oxygen and nutrients) అందుతాయి. శరీరంలో ఏ అవయవం పని చేయాలన్నా రక్తం తప్పనిసరి. బ్లడ్ (Blood) తక్కువగా ఉంటే ఒక్కటి కాదు, అనేక వ్యాధులు మనిషిని వెంటాడతాయి. రక్త ప్రసరణ (blood circulation) సరిగా లేనప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని గుర్తిస్తే సమస్య తీవ్రం కాకుండా నివారించుకునే ఛాన్స్ ఉంటుంది. రక్తం అనేది తెల్ల రక్త కణాలు (white blood cells), ఎర్ర రక్త కణాలు (red blood cells), ప్లాస్మా మరియు ప్లేట్‌లెట్లను (plasma and platelets) కలిగి ఉంటుంది. అందులో ప్రతిదానికి వేరే పనుంది. ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ (hemoglobin) కలిగి ఉంటాయి. ఇది ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను తీసుకొని రక్తంలో కలుపుతుంది. రక్తం గుండెకు చేరుకొని శరీరం అంతటా పంపు చేయబడుతుంది.

    Artificial Blood | త్వ‌ర‌లోనే అందుబాటులోకి..

    అయితే రక్త స‌మ‌స్య వ‌ల‌న చాలా మంది ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నారో మ‌నం చూస్తున్నాం. ఈ క్ర‌మంలో జపాన్‌లోని నారా మెడికల్ యూనివర్సిటీ (Nara Medical University in Japan) శాస్త్రవేత్తలు కృత్రిమ రక్తం (Artificial Blood) తయారీలో గొప్ప అడుగు వేశారు. ఇది భవిష్యత్తులో అత్యవసర చికిత్సల కోసం ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. అయితే కృత్రిమ ర‌క్తం ఇప్పుడున్న న‌మూనాల క‌న్నా కూడా 24 రెట్లు ఎక్కువ లైఫ్‌ని క‌లిగి ఉంటుంది. ఇది ఒకటే బ్ల‌డ్ గ్రూప్ (blood group) ఉంటుంది. దీనిని అన్ని ర‌కాల బ్ల‌డ్ గ్రూప్స్ వారికి ఎక్కించ‌వ‌చ్చు. ఈ కృత్రిమ బ్ల‌డ్ అందుబాటులోకి వ‌స్తే బ్ల‌డ్ డొనేష‌న్ (blood donation) అవ‌స‌రం త‌గ్గుతుంది.

    ఇది ఎలా త‌యారు చేస్తారంటే.. జ‌పాన్‌కి చెందిన నారా మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ (Nara Medical University) హిరోమి స‌కాయ్, ఆమె టీం గడువు ముగిసిన ర‌క్తం నుండి హిమోగ్లోబిన్ తీసుకొని వైర‌స్ నిరోధ‌క షెల్‌లో ఉంచి కృత్రిమ రక్తాన్ని (artificial blood) త‌యారు చేస్తారు. ఇది గడువు ముగిసిన కూడా డొనేట్ చేయ‌బ‌డిన బ్ల‌డ్ ప్ర‌యోజ‌నాల‌ని పెంచుతుంది. బ్ల‌డ్ గ్రూపుల‌తో సంబంధం లేకుండా అన్ని గ్రూపుల‌కి కూడా ఈ ర‌క్తం ఎక్కించ‌వ‌చ్చు. స‌కాయ్ ల్యాబ్‌లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ (Clinical Trails) జ‌రుగుతున్నాయి. స్వ‌చ్ఛంద కార్య‌క‌ర్త‌లు 100 నుండి 400 మిల్లీ లీట‌ర్స్ కృత్రిమ ర‌క్తాన్ని తీసుకుంటున్నారు. ర‌క్తం సేఫ్‌, బాగుంది అని నిరూపితం అయితే 2030 నాటికి దీనిని జ‌పాన్ అంతా అమ‌లు చేసే అవ‌కాశం ఉంది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది అందుబాటులోకి రానుంది.

    Latest articles

    rcb won Ipl trophy | ఈ సాలా క‌ప్ న‌మ్డే 18 ఏళ్ల త‌ర్వాత ఆర్సీబీ ఖాతాలో ఐపీఎల్ క‌ప్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: rcb won ipl trophy : ఐపీఎల్ 2025 ఫైనల్‌(IPL 2025 final)లో ఆర్సీబీ ఘ‌న...

    IPL-2025 RCB vs PBK |బెంగళూరును వరించిన ఐపీఎల్​-18.. పోరాడి ఓడిన పంజాబ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPL 2025కు ఇక తెరపడింది. అహ్మదాబాద్​(Ahmedabad)లోని నరేంద్ర మోడీ స్టేడియం(Narendra Modi Stadium)లో జరిగిన ఫైనల్​...

    Summer Dance Fest | ఉత్సాహంగా సమ్మర్ డాన్స్ ఫెస్ట్.. స్టెప్పులతో అదరగొట్టిన చిన్నారులు..

    అక్షరటుడే, కామారెడ్డి: Summer Dance Fest : కామారెడ్డి జిల్లా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ (Kamareddy District Dance...

    IPL 2025 RCB vs PBK | దుమ్ము దులిపిన ఆర్సీబీ.. పంజాబ్‌కి భారీ టార్గెట్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Punjab target is 191 : ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ),...

    More like this

    rcb won Ipl trophy | ఈ సాలా క‌ప్ న‌మ్డే 18 ఏళ్ల త‌ర్వాత ఆర్సీబీ ఖాతాలో ఐపీఎల్ క‌ప్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: rcb won ipl trophy : ఐపీఎల్ 2025 ఫైనల్‌(IPL 2025 final)లో ఆర్సీబీ ఘ‌న...

    IPL-2025 RCB vs PBK |బెంగళూరును వరించిన ఐపీఎల్​-18.. పోరాడి ఓడిన పంజాబ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPL 2025కు ఇక తెరపడింది. అహ్మదాబాద్​(Ahmedabad)లోని నరేంద్ర మోడీ స్టేడియం(Narendra Modi Stadium)లో జరిగిన ఫైనల్​...

    Summer Dance Fest | ఉత్సాహంగా సమ్మర్ డాన్స్ ఫెస్ట్.. స్టెప్పులతో అదరగొట్టిన చిన్నారులు..

    అక్షరటుడే, కామారెడ్డి: Summer Dance Fest : కామారెడ్డి జిల్లా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ (Kamareddy District Dance...