అక్షరటుడే, హైదరాబాద్: heatstroke : తెలంగాణ భానుడి highest temperature ప్రతాపం కొనసాగుతోంది. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. వడదెబ్బతో sunstroke గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మృతి చెందారు. ఖమ్మం khammam district జిల్లాలో ముగ్గురు, పెద్దపల్లి peddapalli జిల్లాలో ఒకరు, ఆసిఫాబాద్ asifabad జిల్లాలో ఒకరు, సూర్యాపేట suryapet జిల్లాలో ఒకరు, నిర్మల్ nirmal జిల్లాలో ఒక్కరు, కరీంనగర్ KARIMNAGAR జిల్లాలో ఒక్కరు, వరంగల్ warangal జిల్లాలో ఒక్కరు, జనగామ jangaon జిల్లాలో ఒక్కరు, ములుగు mulugu జిల్లాలో ఒక్కరు చొప్పున ఎండ తీవ్రతను తట్టుకోలేక అసువులు బాసారు.
ఇక గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. నిన్న నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అత్యధికంగా 45.2 డిగ్రీలు నమోదైంది. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.