అక్షరటుడే, వెబ్డెస్క్: టిప్స్ మ్యూజిక్ లిమిటెడ్(Tips Music Ltd.) సంస్థ గత ఆర్థిక సంవత్సరానికి financial year సంబంధించిన నాలుగో క్వార్టర్ fourth quarter results ఫలితాలను బుధవారం ప్రకటించింది. రెవెన్యూతో పాటు నికర లాభాలలో మంచి వృద్ధిని సాధించింది.
Tips Music Ltd | రెవెన్యూ..
2024-15 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.78.48 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇది 2023- 24 ఆర్థిక సంవత్సరం కంటే 24 శాతం అధికం.
Tips Music Ltd | నెట్ ప్రాఫిట్
నికర లాభం 18.8 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో రూ.25.76 కోట్లున్న నికరలాభం గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌లో రూ.30.61 కోట్లకు చేరింది.
Tips Music Ltd | EBITDA..
EBITDA(Earnings before interest, taxes, depreciation and amortization) 24 శాతం పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 30.17 కోట్లున్న EBITDA.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.37.26 కోట్లకు పెరిగింది.
Tips Music Ltd | ఈపీఎస్..
ఈపీఎస్(earnign per share) రూ. 2.01 నుంచి రూ. 2.39 కు చేరింది. కాగా ఇది 2024-25 మూడో క్వార్టర్‌లో రూ. 3.46గా ఉండడం గమనార్హం.
Tips Music Ltd | స్టాక్ పనితీరు(Stock performance)..
రెవెన్యూ, నెట్ ప్రాఫిట్ గణనీయంగా పెరిగినా.. బుధవారం స్టాక్ ధర మాత్రం పడిపోయింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో 3.95 శాతం పడిపోయి 660 వద్ద స్థిర పడింది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 950 కాగా 52 వారాల కనిష్ట ధర రూ. 346. ఐదేళ్లలో 138 శాతం పెరిగిన షేరు ధర.. ఏడాది కాలంలో 43 శాతం రాబడిని అందించింది.