అక్షరటుడే, వెబ్‌డెస్క్: Varanasi – Ayodhya Special Train : సరస్వతి పుష్కరాల సందర్భంగా ఇండియన్ రైల్వే indian railway క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ tourism corporation india స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అయోధ్య – కాశి (వారణాశి) kashi tour పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ aatma gourav express trainతో భక్తులు ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. 10 పగళ్లు/తొమ్మిది రాత్రులు సాగే స్పెషల్ యాత్ర ఇది. మే 8న సికింద్రాబాద్ secundrabad junction నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. మొత్తం 718 సీట్లు ((స్లీపర్ – 460, 3 ఏసీ – 206, 2 ఏసీ- 52) అందుబాటులో ఉంటాయి.
సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ భువనగిరి bhongiri, జనగామjanagaon, ఖాజీపేట్khajipet, వరంగల్warangal, మహబూబాద్mahabubabad, డోర్నకల్ జంక్షన్donrnakal junction, ఖమ్మం khammmam, మధిరmadhira మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. ఇక ఏపీలో విజయవాడ, తెనాలి, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్‌లల్లో దీనికి హాల్ట్ ఉంటుంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ కావొచ్చు. ఈ ప్యాకేజీలో పూరీ – గయ – వారణాశి – అయోధ్య, ప్రయాగ్‌రాజ్ prayagraj కూడా ఉన్నాయి. పూరీలో జగన్నాథుడి ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయాలను దర్శించుకునే వెసులుబాటు ఉంది. గయలో ప్రఖ్యాత విష్ణుపాద ఆలయం సందర్శించవచ్చు. వారణాశి – కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయాలు చూడొచ్చు.
అయోధ్యలో చారిత్రాత్మక బాలరాముడి ayodya baalaramudu ఆలయం, హనుమాన్ గర్హి hanuman garhi Ayodhya ఆలయాలను దర్శించుకోవచ్చు. అక్కడి సరయూ నది sarayu river హారతి వేడుక తిలకించవచ్చు. ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించవచ్చు. ప్రయాగ్‌రాజ్‌తో ఈ ప్యాకేజీ ప్రయాణం ముగుస్తుంది. అక్కడి నుంచి మళ్లీ సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం ఉంటుంది.
Varanasi – Ayodhya Special Train : ఛార్జెస్ ఇలా..
ఈ ప్యాకేజీ కింద ఒక్కరికి ఛార్జీ రూ.16,800(స్లీపర్ క్లాస్). ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి రూ.15,700 రూపాయల ఛార్జీగా నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ (3 ఏసీ)లో పెద్దవారికి రూ.26,600 , పిల్లలకు రూ.25,300 . కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దవారికి రూ.34,900 , పిల్లలైతే రూ.33,300 చెల్లించాల్సి ఉంటుంది.