More
    Homeటెక్నాలజీIBM CEO | ఐబీఎంలో 8,000 ఉద్యోగాలు ఊస్టింగ్.. అంతా ఏఐ ఎఫెక్ట్

    IBM CEO | ఐబీఎంలో 8,000 ఉద్యోగాలు ఊస్టింగ్.. అంతా ఏఐ ఎఫెక్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:IBM CEO | కృత్రిమ మేధస్సు (AI) ఎఫెక్ట్ తో కార్పొరేట్ ఉద్యోగాలు ఊస్టింగ్ అవుతున్నాయి. ఇక జాబ్ సెక్యూరిటీ అనేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.

    తాజాగా టెక్ దిగ్గజం ఐబీఎం సంస్థ(IBM company) దాదాపు 8,000 ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపులలో ఎక్కువగా హ్యూమన్ రీసోర్సెస్ (HR) విభాగంలోని ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగాలను ఏఐ(AI) భర్తీ చేస్తోందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. IBM ఇటీవల తన హెచ్‌ఆర్ కార్యకలాపాలలో ఏఐ వ్యవస్థలను విస్తృతంగా ప్రవేశపెట్టింది. ఇప్పటికే 200 హెచ్‌ఆర్ ఉద్యోగాలను ఇంటెలిజెంట్ ఏఐ సాఫ్ట్‌వేర్ ఏజెంట్లు భర్తీ చేశాయి.

    IBM CEO | ఏఐ తెచ్చిన తంటా..

    ఈ ఏఐ ఏజెంట్లు డేటా సరిపోల్చుకోవడం, ఉద్యోగుల ప్రశ్నలకు స్పందించడం, డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ వంటి పునరావృత పనులను నిర్వహిస్తుండ‌డం జ‌రుగుతుంది. ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ IBM Aravind Krishna మాట్లాడుతూ.. ఈ మార్పులు వ్యాపార వృద్ధికి అవసరమైన విభాగాలకు మూలధనాన్ని మళ్లించడం వల్ల జరిగినవిగా చెప్పుకొచ్చారు.

    “AI వల్ల మేం కొంత ఆదా చేసాం. ఈ ఆదా వల్ల మేం డెవలప్‌మెంట్, మార్కెటింగ్, సెల్స్ విభాగాలలో మరింత పెట్టుబడులు పెట్టగలగాం” అని చెప్పారు. మేము 30% వరకు ఉద్యోగాలను AI మరియు ఆటోమేషన్ ద్వారా భర్తీ చేయగలం. ఇది సుమారు 7,800 ఉద్యోగాలకు సమానం,” అని తెలిపారు.

    IBM చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ నికెల్ లా‌మోరో ప్రకారం, “పూర్తిగా ఉద్యోగాలు పోవు. రిపిటేటివ్ పనులు ఏఐ చేత జరుగుతాయి. మానవ ఉద్యోగులు వ్యూహాత్మక నిర్ణయాలలో భాగమవుతారు” అని తెలిపారు. అయితే ఇప్పుడు కేవలం ఐబీఎం మాత్రమే కాదు ఇతర సంస్థలు కూడా ఏఐ రాకతో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.

    Duolingo ఇటీవల కంటెంట్ మాడరేషన్‌లో మానవ ఉద్యోగుల స్థానంలో ఏఐ టూల్స్‌ను ప్రవేశపెట్టింది. Shopify CEO Tobias Lütke కూడా మానవులను నియమించే ముందు ఏఐ ఆ పని చేయగలదా అనే ప్రశ్న వేసుకోవాలి అని చెప్పడం మార్కెట్ పోకడలు ఎలా ఉన్నాయనేది వివరిస్తుంది. చూస్తుంటే రానున్న రోజుల‌లో ఉద్యోగాలన్నీ కూడా ఏఐ ఎఫెక్ట్‌తో ఉష్ అవడం ఖాయంగా క‌నిపిస్తుంది.

    Latest articles

    Telangana state formation day | తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana state formation day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం(జూన్ 2) సందర్భంగా రాష్ట్ర...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 2 జూన్​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం విక్రమ సంవత్సరం – 2081 పింగళ ఉత్తరాయణం గ్రీష్మ రుతువు రోజు – సోమవారం మాసం – జ్యేష్ఠ పక్షం...

    Bike hitting railing | రెయిలింగ్​ను ఢీకొని యువకుడి దుర్మరణం

    అక్షరటుడే, కామారెడ్డి : Bike hitting railing : జాతీయ రహదారి(national highway)పై రెయిలింగ్​ను ఢీకొని యువకుడు మృతి...

    Sub-Collector | బాన్సువాడ సబ్ కలెక్టర్​కు ఎల్లారెడ్డి ఆర్డీవోగా ఇన్ ఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sub-Collector : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఇన్ ఛార్జి ఆర్డీవోగా బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్...

    More like this