More
    HomeసినిమాPawan Kalyan | ముంబైలో ఓజీ షూటింగ్.. మాస్ అప్పీల్‌తో అద‌ర‌గొట్టిన ప‌వ‌ర్ స్టార్

    Pawan Kalyan | ముంబైలో ఓజీ షూటింగ్.. మాస్ అప్పీల్‌తో అద‌ర‌గొట్టిన ప‌వ‌ర్ స్టార్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Pawan Kalyan | తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్‌స్టార్‌గా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ Pawan kalyan ప్రస్తుతం ముంబై నగరంలో తన తాజా సినిమా షూటింగ్ ఓజీలో పాల్గొంటున్నారు. ప‌వర్ స్టార్ అభిమానులకు ఇది ఎంతో ఉత్సాహాన్నిచ్చే విష‌యం.ఓజీ సినిమా(OG movie) భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ముంబైలో ప్రముఖ ప్రదేశాల్లో, ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాలు, పాతబస్తీ గల్లీలు, మరియు కొన్ని స్టూడియోల్లో చిత్రీకరణ జరుగుతోంది. సుజీత్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుంది.

    Pawan Kalyan | ప‌వ‌న్ లుక్ ఆకర్షణగా

    ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ట్రాన్స్ఫర్మేషన్‌(Transformation)లోకి వెళ్లినట్లు సమాచారం. కొత్త లుక్‌తో పవన్ ముంబై వీధుల్లో కనిపించడంతో స్థానిక ప్రజలు, అభిమానులు ఫోటోలు తీయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కొంద‌రు ఆ వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వింటేజ్ బెల్ బాటమ్ పాయింట్(Vintage Bell Bottom Pant) ధరించి సెక్యూరిటీ మ‌ధ్య కారు ఎక్కేందుకు వెళుతుండ‌గా, కొంద‌రు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ప‌వ‌న్ మాస్ అప్పీల్ లుక్ అదిరింది అంటున్నారు. ప‌వ‌న్ కళ్యాణ్ రాజకీయాల్లో Politics క్రియాశీలకంగా ఉండగా, సినిమా కోసం ఇంత సమయం కేటాయించడం అభిమానుల్లో ఆనందాన్నిపెంచుతుంది.

    ఓజీ OG సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఆయన పాత్ర పక్కా మాస్ అపీలింగ్‌తో ఉండనుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ. షూటింగ్(Shooting) వేగంగా జరుగుతుండటంతో ఈ సినిమాని అనుకున్న టైమ్‌కి విడుద‌ల చేస్తార‌ని అంటున్నారు. సెప్టెంబ‌ర్ 25, 2025 చిత్రాన్ని థియేట‌ర్స్‌లోకి తీసుకురానున్నారు. విజయదశమిని దృష్టిలో ఉంచుకొని సినిమా విడుదల తేదీని లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా 8 రోజుల పాటు బాక్సాఫీస్ కలెక్షన్లకు ఆటంకం లేకుండా ఉండేలా రిలీజ్ డేట్ ను ఫైన్ చేశారని తెలుస్తోంది. దీంతో మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాటలో పయనించబోతుందని తెలుస్తోంది.

    Latest articles

    Actor Rajendra Prasad | రాజేంద్ర ప్ర‌సాద్ ఇక మార‌డా.. స‌భా మ‌ర్యాద లేకుండా ఏంటి ఆ బూతులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Actor Rajendra Prasad | సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ (Senior actor Rajendra Prasad)...

    PRE MARKET ANALYSIS | బలహీనంగా గ్లోబల్‌ క్యూస్‌.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PRE MARKET ANALYSIS : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) బలహీనంగా కొనసాగుతున్నాయి. ఎక్కువగా నష్టాల...

    IPL 2025 | ముంబై కెప్టెన్‌ని క‌న్నీరు పెట్టించిన శ్రేయాస్ అయ్య‌ర్.. ఇక ఆర్సీబీతో యుద్ధానికి సిద్ధం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL 2025 | ఐపీఎల్ 2025లో (IPL 2025) ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డే జ‌ట్ల‌పై క్లారిటీ వచ్చింది....

    Today Gold rate | ఈ రోజు కాస్త శాంతించిన బంగారం ధ‌ర‌లు.. తులం ఎంత ధ‌ర అంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today Gold rate | బంగారం ధ‌ర‌లు ఎప్పుడు పెరుగుతున్నాయో ఎప్పుడు త‌గ్గుతున్నాయో అర్ధం కాని...

    More like this