అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2025 సొంత గడ్డపై సన్రైజర్స్ sunrisers hyderabad ఘోర ఓటమిని చవిచూసింది. ఐపీఎల్ 2025 ipl 2025లో భాగంగా ఉప్పల్ వేదికగా uppal stadium సాగిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ mumbai Indians విజయం సాధించింది.
144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే ఓపెనర్ రికెల్ టన్ (11) వికెట్ కోల్పోయింది. ఈ తరుణంలో రోహిత్ శర్మ, విల్ జాక్స్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ పోటీ పడటంతో పవర్ ప్లే లో ముంబయి జట్టు 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది.
రెండో వికెట్ కు 63 పరుగులు జోడించిన తర్వాత జాక్స్( 22 పరుగులు) చేసి ఔటయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన సూర్యతో కలిసి రోహిత్ మ్యాచ్ ను విజయం దరికి చేర్చాడు. కాగా, 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ( 71 పరుగులు) కాసేపటికే ఔటయ్యాడు.
మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ లో టాపార్డర్, మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ (44 బంతుల్లో 71: 9 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్ భారాన్ని మోశాడు.
అభిషేక్ శర్మ(8), నితీష్ కుమార్ రెడ్డి(2), అనికేత్ వర్మ (8) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ (44 బంతుల్లో 71: 9 ఫోర్లు, 2 సిక్స్) బ్యాటింగ్ భారాన్ని మోశాడు.
మొత్తం మీదు సన్రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.