అక్షరటుడే, న్యూఢిల్లీ: Pahalgam terror attack : భారత్‌లోని అమెరికా american citizens india పౌరులకు ఆ దేశం అడ్వైజరీ జారీ చేసింది. జమ్మూకశ్మీర్‌కు వెళ్లొద్దని సూచించింది. జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అమెరికా ఈ అడ్వైజరీ us advisory to citizens జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లవద్దని అమెరికా బుధవారం తన పౌరులకు సూచించింది.
“జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత Union Territory of Jammu and Kashmir ప్రాంతంలో ఉగ్రవాద దాడులు, హింసాత్మక పౌర అశాంతి సంభవించే అవకాశం ఉంది. ఈ రాష్ట్రానికి ప్రయాణించవద్దు(తూర్పు లడఖ్ ప్రాంతం eastern Ladakh region, దాని రాజధాని లేహ్ capital Leh సందర్శనలను మినహాయించి). ఈ ప్రాంతంలో హింస అప్పుడప్పుడు జరుగుతుంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖ వెంబడి హింసాత్మక ఘటనలు సర్వసాధారణం. ఇది కశ్మీర్ లోయలోని పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్ల( Kashmir Valley, Srinagar, Gulmarg, Pahalgam) లో కూడా జరుగుతుంది. భారత ప్రభుత్వం విదేశీ పర్యాటకులను నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాలను సందర్శించడానికి అనుమతించదు” అని ఇండియాలోని యూఎస్ రాయబార కార్యాలయం పేర్కొంది.
Pahalgam terror attack : కశ్మీర్‌ను వీడుతున్న పర్యాటకులు..
ఉగ్రదాడి తర్వాత పర్యాటకులు పెద్ద సంఖ్యలో కాశ్మీర్‌ను వీడుతున్నారు. గంటల వ్యవధిలోనే వేలాది మంది తిరుగు ప్రయాణమయ్యారు. స్పైస్జెట్, ఎయిర్ ఇండియాతో సహా అనేక విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ప్రయాణ సలహాలు జారీ చేశాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పర్యాటకులు తిరిగి రావడానికి వీలుగా శ్రీనగర్ నుంచి విమానాల సంఖ్యను పెంచాలని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ విమానయాన సంస్థలను కోరింది. అంతేకాకుండా, శ్రీనగర్ విమాన టిక్కెట్ల రద్దు, రీషెడ్యూల్ రుసుములను రద్దు చేయడాన్ని పరిగణించాలని కూడా విమానయాన సంస్థలకు సూచించింది.