అక్షరటుడే, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని భారత్ indian government అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఉగ్రదాడి terrorist attack నేపథ్యంలో ప్రధాని మోదీ pm modi నేతృత్వంలో నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(CCS) భేటీ నిర్వహించారు. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని కేంద్రం పేర్కొంది. పాక్ టూరిస్టులు pak Tourist వెంటనే భారత్‌ను వీడాలని తేల్చి చెప్పింది. అంతేకాకుండా ప్రత్యేక వీసాదారులు ban on Pak citizens in india 48 గంటల్లో దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Union government | కేబినెట్ కమిటీ నిర్ణయాలు ఇవే..
కేబినెట్ కమిటీ భేటీలో union cabinet meeting decission తీసుకున్న నిర్ణయాలను భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ foreign ministry secretary vikram misry మీడియాకు తెలిపారు. పాకిస్తాన్ పౌరులను భారత దేశంలోకి అనుమతించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. అంతేకాకుండా రాయబార కార్యాలయాల సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక వీసాలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సరిహద్దు దాటిన వారు మే 1లోగా వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. అలాగే అటారీ- వాఘా చెక్‌పోస్టును తక్షణమే నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కీలకమైన పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.