అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Private hospitals | నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధికారుల తనిఖీలు మంగళవారం కొనసాగాయి.
పోలీసు (Police), ఫైర్(fire), వైద్య ఆరోగ్యశాఖ (Department of Health) అధికారులు సంయుక్తంగా తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని తక్ష్ ఆస్పత్రిలో (Taksh Hospital) ఫైర్‌సేఫ్టీ పరికరాలను పరిశీలించారు. అలాగే ఆస్పత్రిలో నిర్వహిస్తున్న మెడికల్ షాప్‌లో మందుల గడువు తేదీలను తనిఖీ చేశారు. ఫైర్‌సేఫ్టీ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.