అక్షరటుడే, ఇందూరు: Candlelight rally | పహల్గాంలో Pahalgam ఉగ్రవాదుల దాడిలో అమరులైన టూరిస్టులకు జిల్లాలో పలువురు నివాళులు అర్పించారు. బుధవారం కొవ్వొత్తుల ర్యాలీలు తీశారు.
ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ TNGOs District President Nasetti Suman మాట్లాడుతూ.. పర్యటాకుల మృతికి కారణమైన టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ర్యాలీలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షుడు పెద్దోళ్ల నాగరాజు, కోశాధికారి దినేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Candlelight rally | ఇందల్వాయిలో..
ఇందల్వాయిలో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
అక్షరటుడే, ఇందల్వాయి: మండల కేంద్రంలో బీజేపీ మండలాధ్యక్షుడు లోలం సత్యనారాయణ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. టూరిస్టులపై Tourists ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు నాయుడు రాజన్న, గన్నారం మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Candlelight rally |ఉగ్రదాడిని ఖండిస్తున్నాం
నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ..
అక్షరటుడే, ఇందూరు: ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. గాంధీ చౌక్ నుంచి బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి, విజయ్, మాస్టర్ శంకర్, శ్రీధర్, ఇపకాయల కిషోర్, వేణు రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.