More
    Homeబిజినెస్​Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ

    Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic stock markets) సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

    ఉదయం 207 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌.. ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 771 పాయింట్లు పెరిగింది. గత ట్రేడింగ్‌ సెషన్‌తో పోల్చితే 66 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. ఇంట్రాడేలో గరిష్టంగా 226 పాయింట్లు లాభపడి 25 వేల మార్క్ ను దాటింది. ఆ తర్వాత గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ (Sensex) 450 పాయింట్ల లాభంతో 82,171 వద్ద, నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 24,981 వద్ద కొనసాగుతున్నాయి.

    యూరోపియన్‌ యూనియన్‌పై 50 శాతం సుంకాల (Tariffs) వడ్డింపు నిర్ణయాన్ని అమెరికా 40 రోజుల పాటు వాయిదా వేయడంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలవడం, ఆర్‌బీఐ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 2.69 లక్షల కోట్ల డివిడెండ్‌(Dividend)ను ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించడం, నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించి వర్షాలను కురిపిస్తుండడం, ఓవైపు డాలర్‌ బలహీనపడుతుండగా మరోవైపు రూపాయి విలువ బలోపేతం అవుతుండడం వంటి కారణాలతో మన మార్కెట్లు రాణిస్తున్నాయి. మార్కెట్లలోకి రిటైల్‌ మనీ పోటెత్తుతూనే ఉంది. గత వారంలో సుమారు 6 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు(New investors) మార్కెట్‌లోకి రావడం గమనార్హం. దీంతో మన మార్కెట్లు స్థిరంగా ముందుకు సాగుతున్నాయి.

    READ ALSO  Stock Market | మార్కెట్‌ క్రాష్‌ నుంచి కోలుకుంటున్న సూచీలు

    Stock Market | రాణిస్తున్న అన్ని రంగాల షేర్లు..

    పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈ(BSE)లో పవర్‌ ఇండెక్స్‌ సుమారు ఒక శాతం పెరగ్గా.. ఆటో ఇండెక్స్‌ 0.89 శాతం, ఐటీ సూచీ 0.87 శాతం, ఇన్‌ఫ్రా ఇండెక్స్‌ 0.80 శాతం పెరిగాయి. కన్జూమర్‌ డ్యూరెబెల్‌ ఇండెక్స్‌ 0.70 శాతం పెరగ్గా.. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పీఎస్‌యూ, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ ఇండెక్స్‌లు అర శాతానికిపైగా లాభంతో కొనసాగుతున్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌(Small cap index) 0.63 శాతం లాభాలతో ఉండగా.. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.49 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.46 శాతం లాభంతో కొనసాగుతున్నాయి.

    Stock Market | Top gainers..

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 24 కంపెనీలు లాభాలతో సాగుతుండగా.. 6 కంపెనీలు మాత్రమే నష్టాలతో ఉన్నాయి. ఎంఅండ్‌ఎం 2 శాతం లాభంతో ఉండగా.. టాటా మోటార్స్‌(Tata motors) 1.85 శాతం, నెస్లే 1.72 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌ ఒక శాతానికిపైగా లాభంతో కదలాడుతున్నాయి.

    READ ALSO  Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    Stock Market | Top losers..

    ఎటర్నల్‌(Eternal) 3.68 శాతం నష్టపోయింది. అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.73 శాతం, సన్‌ ఫార్మా 0.34 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 0.32 శాతం నష్టంతో కొనసొగుతున్నాయి.

    Latest articles

    Chiranjeevi | డ్రిల్ మాస్ట‌ర్‌గా చిరంజీవి.. ముస్సోలిలో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌ర‌ణ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Chiranjeevi | సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ ఏడాది సంక్రాంతికి వ‌స్తున్నాం...

    BC Sankshema Sangham | బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా విజయ్

    అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా విజయ్...

    Mla Dhanpal | మనోసంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలి

    అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | మనో సంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా...

    Fastag | వాహనదారులకు గుడ్​న్యూస్​.. ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. రూ.3 వేలకే ఏడాదంతా ఎక్కడైనా తిరుగొచ్చు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Fastag | వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్​(Fastag)పై కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు...

    More like this

    Chiranjeevi | డ్రిల్ మాస్ట‌ర్‌గా చిరంజీవి.. ముస్సోలిలో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌ర‌ణ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Chiranjeevi | సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ ఏడాది సంక్రాంతికి వ‌స్తున్నాం...

    BC Sankshema Sangham | బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా విజయ్

    అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా విజయ్...

    Mla Dhanpal | మనోసంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలి

    అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | మనో సంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా...