More
    HomeతెలంగాణPhone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

    Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్​రావు(Prabhakar Rao)ను భారత్​ రప్పించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు త్వరలో సఫలం కానున్నాయి.

    భారత ప్రభుత్వం పంపిన రెడ్ కార్నర్ నోటీసు(red corner notice) అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో ప్రభాకర్​రావును యూఎస్​ త్వరలో భారత్​కు అప్పగించే అవకాశం ఉంది. బీఆర్​ఎస్​(BRS) హయాంలో ఎస్​ఐబీ చీఫ్(SIB Chief)​గా ఉన్న ప్రభాకర్​రావు పలువురు రాజకీయ నేతలతో పాటు జడ్జీలు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్​ చేసినట్లు కేసు నమోదైన విషయం తెలిసిందే. పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో 2024 మార్చి 10న కేసు నమోదు కాగా.. మరుసటి రోజే ప్రభాకర్‌రావు అమెరికా పారిపోయారు. ఈ కేసును విచారిస్తున్న ఆయనను ఇండియాకు రప్పించడానికి తీవ్రంగా యత్నిస్తోంది.

    Phone Tapping Case | రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా..

    ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ప్రభాకర్​రావు పోలీసు విచారణకు సహకరించడం లేదు. అమెరికా(America)కు వెళ్లిన ఆయన తిరిగి రాకుండా అక్కడే ఉండాలని ప్లాన్​ వేశారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ఆయన అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభాకర్ రావును రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా ఫోన్ ట్యాపింగ్ అక్రమాలను నివేదిక రూపంలో దర్యాప్తు బృందం అమెరికా ప్రభుత్వానికి పంపింది. దీంతో ఇంటర్‌పోల్‌ మార్చి 10న జారీ చేసిన రెడ్‌కార్నర్‌ నోటీస్‌ అమలు దిశగా యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కసరత్తు ప్రారంభించింది. కాగా జూన్ 20లోపు విచారణకు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు(Nampally Court) గతంలో ఆదేశాలు జారీ చేసింది.

    Latest articles

    CBI Case | బీమా డబ్బులు చెల్లించడానికి లంచం డిమాండ్​.. సీబీఐ ఎంట్రీతో షాక్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: CBI Case | దేశంలో అవినీతి అధికారులకు కొదువలేకుండా పోయింది. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి...

    PCC Chief | దేశానికి రోల్​ మోడల్​గా కుల గణన: పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PCC Chief | రాష్ట్రంలో చేపట్టిన కులగణన దేశానికే రోల్​ మోడల్​గా నిలిచిందని పీసీసీ...

    ACB Case | సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం.. మహిళను అరెస్ట్​ చేసిన ఏసీబీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | సింగరేణి (Singareni)లో ఉద్యోగం కోసం ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. అయితే...

    Navodaya Vidyalaya Nizamabad | ఈ ఏడాది నుంచే నవోదయ తరగతుల ప్రారంభం

    అక్షరటుడే, ఇందూరు: Navodaya Vidyalaya | నిజామాబాద్ జిల్లాకు నూతనంగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ విద్యా...

    More like this