ePaper
More
    HomeజాతీయంLiteracy Rate | అక్ష‌రాస్య‌త‌లో వెనుకబడిన తెలుగు రాష్ట్రాలు.. మిజోరం ఫ‌స్ట్‌.. ఏపీ లాస్ట్‌

    Literacy Rate | అక్ష‌రాస్య‌త‌లో వెనుకబడిన తెలుగు రాష్ట్రాలు.. మిజోరం ఫ‌స్ట్‌.. ఏపీ లాస్ట్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Literacy Rate | అక్ష‌రాస్య‌త రేటులో దేశంలోని మిగ‌తా రాష్ట్రాల‌తో పోలిస్తే తెలుగు రాష్ట్రాలు బాగా వెనుక‌బ‌డ్డాయి. అక్ష‌రాస్య‌త జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra preadesh) చివ‌రి స్థానంలో నిలవ‌గా, తెలంగాణ (Telangana) ఆరో స్థానంలో నిలిచింది. ఇది తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల (Telugu state governament) వైఫ‌ల్యాన్ని ఎత్తిచూపుతోంది. మ‌రోవైపు, దేశంలో అత్య‌ధిక అక్ష‌రాస్య‌త సాధించిన రాష్ట్రంగా ఈశాన్య ప్రాంతానికి చెందిన మిజోరం(Mizoram) మొద‌టి స్థానంలో నిలిచింది. 76.32 శాతం లిట‌ర‌సీ రేటు సాధించి ఫ‌స్ట్ ప్లేస్ సాధించ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో పూర్తి అక్ష‌రాస్య‌త హోదాను సాధించిన రాష్ట్రంగా మిజోరం నిలిచింద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి లాల్దు హోమా రెండ్రోజుల క్రితం ప్ర‌క‌టించారు. ఇది విద్యామంత్రిత్వ శాఖ (Ministry of Education) నిర్దేశించుకున్న 95 శాతం అక్ష‌రాస్య‌త రేటు ప‌రిమితిని అధిగ‌మించింద‌ని చెప్పారు.

    READ ALSO  Elephant | రైల్వే ట్రాక్‌పై ఏనుగు ప్రసవం.. రెండు గంటల పాటు నిలిచిన రైలు..: వీడియో వైరల్

    Literacy Rate | వెనుక‌బ‌డ్డ తెలుగు రాష్ట్రాలు

    స్వాతంత్య్రానంత‌రం ఇండియాలో అక్ష‌రాస్య‌త రేటు (India literacy rate) బాగా పెరిగింది. అప్ప‌ట్లో అక్షరాస్యత రేటు కేవలం 14% మాత్రమే ఉండ‌గా, ఆ త‌ర్వాతి రోజుల్లో బాగా మెరుగుప‌డింది. ఇప్పుడు దాదాపు 76.32 శాతం అక్షరాస్యత రేటును (literacy rate) సాధించిందని అధికారిక లెక్క‌లు వెల్ల‌డిస్తున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాలు (Telugu states) మాత్రం వెనుక‌బ‌డ్డాయి. 2024లో అత్య‌ల్ప అక్ష‌రాస్య‌త రేటు క‌లిగిన రాష్ట్రాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ (72.6 శాతం) మొద‌టి స్థానంలో ఉంది. తెలంగాణ (76.9శాతం)తో దిగువ నుంచి ఆరో ప్లేస్‌లో నిలిచింది. మొత్తంగా అత్య‌ల్ప అక్ష‌రాస్య‌త క‌లిగిన ఉన్న రాష్ట్రాల్లో ఏపీ త‌ర్వాత బీహార్ (74.3%), మధ్యప్రదేశ్ (75.2%), రాజస్థాన్ (75.8%), జార్ఖండ్ (76.7%) , తెలంగాణ (76.9%), ఉత్తర ప్రదేశ్ (78.2%) త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి.

    READ ALSO  Shashi Tharoor | ఎమ‌ర్జెన్సీ దేశ చ‌రిత్ర‌లో చీక‌టి అధ్యాయం.. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా శ‌శిథరూర్ వ్యాసం

    Literacy Rate | చిన్న రాష్ట్రాలే ముందు..

    అక్ష‌రాస్య‌త రేటులో చిన్న రాష్ట్రాలే (Small states) ముందుండ‌డం గ‌మ‌నార్హం. 2011 జనాభా లెక్కల ప్రకారం 91.33% అక్షరాస్యత రేటుతో భారతదేశంలో (india) మూడో స్థానంలో నిలిచిన మిజోరం.. తాజాగా లెక్క‌ల ప్ర‌కారం మిజోరం మొద‌టి స్థానాన్ని ఆక్ర‌మించింది. ఇందుకు విరుద్ధంగా PLFS 2023-24 MoSPI సర్వే ప్రకారం.. పట్టణ, గ్రామీణ జనాభా అత్య‌ధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌, బీహార్ (Andhra Pradesh and Bihar) రుసగా 72.6%, 74.3% అక్షరాస్యత రేటును నమోదు చేశాయి. గ్రామీణ, పట్టణ జనాభాలో 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు (పురుషులు, మహిళలు) సహా భారతదేశంలో మొత్తం అక్షరాస్యత రేటు 2023-24 కాలంలో 80.9%గా ఉంది.

    Literacy Rate | అత్యధిక అక్షరాస్యత రేట్లు కలిగిన టాప్ 10 రాష్ట్రాలు

    1. మిజోరం 98.2%
    2. లక్షద్వీప్ 97.3%
    3. నాగాలాండ్ 95.7%
    4. కేరళ 95.3%
    5. మేఘాలయ 94.2%
    6. త్రిపుర 93.7%
    7. చండీగఢ్ 93.7%
    8. గోవా 93.6%
    9. పుదుచ్చేరి 92.7%
    10. మణిపూర్ 92%
    READ ALSO  Tamil Nadu | గూడ్స్ ట్రైన్​లో భారీ అగ్నిప్రమాదం.. నిలిచిన రైళ్ల రాకపోకలు

    Literacy Rate | అత్యల్ప అక్షరాస్యత కలిగిన 10 రాష్ట్రాలు

    1. ఆంధ్రప్రదేశ్ 72.6%
    2. బీహార్ 74.3%
    3. మధ్యప్రదేశ్ 75.2%
    4. రాజస్థాన్ 75.8%
    5. జార్ఖండ్ 76.7%
    6. తెలంగాణ 76.9%
    7. ఉత్తర ప్రదేశ్ 78.2%
    8. ఛత్తీస్‌గఢ్ 78.5%
    9. లడఖ్ 81%
    10. జమ్మూకశ్మీర్ 82%

    Latest articles

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    KTR | నిధులు రాహుల్​గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం నిధులు రాహుల్ గాంధీకి (Rahul Gandhi), నీళ్లు...

    Nizamabad | విద్యార్థులకు నోట్​బుక్కుల పంపిణీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | నగరంలోని బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పాఠశాలలో గాదె సతీష్ మెమోరియల్ చారిటబుల్...

    ACB Raids | గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు.. అవినీతి అధికారుల్లో గుబులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | రాష్ట్రంలో ఏసీబీ (ACB) దూకుడు పెంచింది. గతంలో ఫిర్యాదులకు సంబంధించి...

    More like this

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    KTR | నిధులు రాహుల్​గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం నిధులు రాహుల్ గాంధీకి (Rahul Gandhi), నీళ్లు...

    Nizamabad | విద్యార్థులకు నోట్​బుక్కుల పంపిణీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | నగరంలోని బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పాఠశాలలో గాదె సతీష్ మెమోరియల్ చారిటబుల్...