More
    HomeతెలంగాణWeather Updates | రానున్న మూడు రోజులు భారీ వర్షాలు

    Weather Updates | రానున్న మూడు రోజులు భారీ వర్షాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | తెలంగాణ (Telangan)లో అప్పుడే వానాకాలం(Monsoon) మొదలైనట్లు వాతావరణం(Weather) మారిపోయింది. గత నాలుగు రోజులుగా వర్షం పడుతుండటంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

    Weather Updates | వాయుగుండంగా మారే అవకాశం

    అరేబియా సముద్రంలో (Arabian Sea) ఏర్పడిన అల్పపీడనం(Low pressure) శనివారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు(Heavy Rains in Telangana) కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

    READ ALSO  Weather Updates | పలు జిల్లాలకు వర్ష సూచన

    Weather Updates | పడిపోయిన ఉష్ణోగ్రతలు

    రాష్ట్రంలో వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు(Temperature) భారీగా పడిపోయాయి. ఎండలు దంచి కొట్టాల్సిన మే నెలలో చలిగాలులు వీస్తుండటం గమనార్హం. సాధారణంగా మే నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. 40 డిగ్రీలు దాటి ఎండలు మండుతాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటనే భయపడేవారు. కానీ ఈ ఏడాది పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శనివారం ఆదిలాబాద్‌లో 33.8, నిజామాబాద్​లో 32 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

    Weather Updates | చురుగ్గా రుతుపవనాలు

    వాతావరణం అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే అండమాన్​ నికోబార్​ దీవుల్లో విస్తరించిన రుతుపవనాలు ఈ రోజు లేదా రేపు కేరళ(Kerala) తీరాన్ని తాకే అవకాశం ఉంది. గతేడాది మే 30న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ సారి ముందుగానే వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వానాకాలం సీజన్​ పనులు ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారు.

    READ ALSO  Weather Updates | రానున్న ఐదు రోజులు భారీ వర్ష సూచన

    Weather Updates | మరో అల్పపీడనం

    ఇప్పటికే అరేబియా సముద్రంలో వాయుగుండంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. అంతేగాకుండా ఈనెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో కూడా రాష్ట్రంలో వర్షాలు పడుతాయని తెలిపింది.

    Latest articles

    UK telecom company BT | యూకే టెలికాం దిగ్గజం షాకింగ్ నిర్ణయం… రోడ్డున పడనున్న 55 వేల ఉద్యోగులు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UK telecom company BT : ఆర్థిక మాంధ్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఏ రంగంలో చూసినా...

    Today gold Price | నేడు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయి.. కాస్త శాంతించాయా, లేదా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today gold Price : ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం, డాలర్ ఇండెక్స్ బలహీనత, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో...

    UAE Indian doctor | యూఏఈ ఇండియన్​ డాక్టర్​ దాతృత్వం.. మరణించిన వైద్య విద్యార్థులకు రూ.6 కోట్ల విరాళం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UAE Indian doctor : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఐదుగురు MBBS విద్యార్థులు...

    Iran – Israel War | భారత్​ విన్నపానికి ఒకే చెప్పిన ఇరాన్​.. విద్యార్థుల తరలింపునకు భూ సరిహద్దులు తెరిచిన టెహ్రాన్​ ​

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Iran - Israel War : ఇరాన్ నుంచి తమ విద్యార్థులను సురక్షితంగా తరలించాలని జూన్...

    More like this