అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు US President డోనాల్డ్ ట్రంప్ Donald Trump రోజుకో నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నారు. అన్ని దేశాలపై ప్రతికార సుంకాలు విధించిన ట్రంప్ తర్వాత ఆ నిర్ణయాన్ని 90 రోజులు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే చైనా chinaపై మాత్రంగా భారీగా సుంకాలు tariffs విధించారు. మొదట 145శాతం సుంకాలు వేశారు. దీంతో డ్రాగన్ దేశం సైతం అమెరికా ఉత్పత్తులపై 125శాతం సుంకాలు విధించడంతో పాటు విలువైన ఖనిజాల ఎగుమతులను Minerals exports నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ట్రంప్ చైనాపై 245 శాతం టారిఫ్స్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
Trump Tariffs | 3,521శాతం సుంకాలు
ట్రంప్ చైనాపై విధిస్తున్న టారిఫ్‌ల భయంతో చాలా కంపెనీలు చైనాను వదిలి ఇతర దేశాలకు వెళ్తున్నాయి. ముఖ్యంగా సోలార్ ప్యానెళ్లు solar panels ఎగుమతి చేసే కంపెనీలు ఆగ్నేయ ఆసియాకు తమ కార్యకలాపాలను తరలించాయి. తాజాగా ట్రంప్ ఆ దేశాలపై కూడా సుంకాల మోత మోగించారు. ఆగ్నేయ ఆసియా దేశాలైన కంబోడియా, వియత్నం, మలేషియా, థాయిలాండ్‌లో ఉత్పత్తి అయిన సోలార్ ప్యానెళ్లపై 3,521శాతం వరకు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. కంబోడియా Cambodia సౌర విద్యుత్ పరికరాలపై 3,521 శాతం, వియత్నం Vietnam లోని కంపెనీలపై 395.9 శాతం వరకు టారిఫ్‌లను విధించారు. అలాగే థాయిలాండ్ Thailand ఉత్పత్తులపై 375.2 శాతం, మలేషియా Malaysiaపై 34.4 శాతంగా నిర్ణయించారు.
Trump Tariffs | భారతీయ కంపెనీలకు మేలు
అమెరికాకు సౌర విద్యుత్ పరికరాలు ఎగుమతి చేసే దేశాల్లో భారత్ bharat కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఆగ్నేయ ఆసియా దేశాల సౌర ఉత్పత్తులపై ట్రంప్ టారిఫ్‌ల మోత మోగించడంతో భారతీయ కంపెనీలకు indian companies మేలు జరగనుంది. భారత విదేశాంగశాఖ దీనిని అడ్వాంటేజ్‌గా తీసుకుంటే.. మన ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది.
Trump Tariffs | భారీగా పెరిగిన వారీ ఎనర్జీస్ స్టాక్
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సోలార్ విద్యుత్ solar power అసవరం లేదని ప్రకటించారు. దీంతో భారత్ నుంచి అమెరికాకు సోలార్ విద్యుత్ పరికరాలు ఎగుమతి చేసే వారి ఎనర్జీస్ waree energies కంపెనీ స్టాక్ భారీగా పడిపోయింది. తాజాగా ట్రంప్ పలు దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించడంతో పాటు, వారీ ఎనర్జీస్ కంపెనీకి మంచి లాభాలు రావడంతో ఆ కంపెనీ షేర్ దూసుకుపోతుంది. ఐదు రోజుల్లో ఈ స్టాక్ ఏకంగా 34శాతం పెరగడం గమనార్హం. బుధవారం ఒక్క రోజే ఈ స్టాక్ 16శాతం పెరిగింది.