అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister seethakka | దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం telangana govt గుడ్న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహం Marriage encouragement ఎప్పటి నుంచో అమలులో ఉంది. వివాహం చేసుకున్న జంటలో ఎవరో ఒకరు దివ్యాంగులు అయితే ప్రభుత్వం ప్రోత్సాహం అందజేసింది. ప్రస్తుతం ఈ పథకం రూ.లక్ష నగదు అందిస్తున్నారు. అయితే దంపతుల్లో ఎవరో ఒకరు దివ్యాంగులు అయితే మాత్రమే ఈ పథకం వర్తించేది.
ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే ప్రోత్సాహకం అందేది కాదు. దీనిపై కొన్నేళ్లుగా దివ్యాంగులు పోరాడుతున్నారు. ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్న ప్రోత్సాహకం అందించాలని కోరుతున్నారు. ఎట్టకేలకు మంత్రి సీతక్క minister Seethakka చొరవతో వారి వినతికి మోక్షం లభించింది. ఇకపై ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్న రూ.లక్ష ప్రోత్సాహక నగదు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ anitha ramachandran ఉత్తర్వులు జారీ చేశారు.