More
    HomeజాతీయంYouTuber Jyoti Malhotra | లేడీ యూట్యూబర్​.. పాక్​ గూఢచర్యానికి ఎలా పాల్పడిందంటే..

    YouTuber Jyoti Malhotra | లేడీ యూట్యూబర్​.. పాక్​ గూఢచర్యానికి ఎలా పాల్పడిందంటే..

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: భారత్‌లో ఉంటూ పాక్(Pakisthan)​ కోసం గూఢచర్యం చేసిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మామూలు లేడీ కాదండోయ్​. విచారణలో ఆమె గురించి సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఢిల్లీలోని పాకిస్తాన్​ ఎంబసీ అధికారి డానిష్‌ ద్వారా ఆమె చేసిన పనులు వెలుగు చూశాయి.

    YouTuber Jyoti Malhotra : పోలీసు కస్టడీలో..

    ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న జ్యోతి మల్హోత్రా.. ఢిల్లీలోని పాక్ ఎంబసీ(Pakisthani embassy)లో డానిష్ Danish ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నట్లు తెలిసింది. ఈ ఈవెంట్‌లోనే పాకిస్తాన్​ జాతీయ దినోత్సవం గురించి జ్యోతి, డానిష్ మాట్లాడుకున్నట్లు సమాచారం. మిగతావారితోనూ మాట్లాడినట్లు తెలిసింది. కాగా, గూఢచర్యం కేసులో డానిష్ అనే పాక్ ఎంబసీ అధికారిని భారత్‌ ఈ నెల 13న బహిష్కరించిన విషయం తెలిసిందే.

    READ ALSO  LOVE | ప్రేమించినవాడు దక్కలేదని 11 రాష్ట్రాల్ని వణికించింది..!

    YouTuber Jyoti Malhotra : పాక్ వెళ్లి..

    డానిష్ సాయంతో జ్యోతి పాక్​కు చాలాసార్లు వెళ్లినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. జ్యోతి యూట్యూబ్ ఛానెల్‌లో ఆమె పాక్​ పర్యటన డాక్యుమెంట్ వీడియోలు ఉన్నాయి. వాటిల్లో “పాకిస్తాన్‌లో భారత్​ అమ్మాయి”, “లాహోర్‌ను అన్వేషిస్తున్న భారత్​ యువతి”, “కటాస్ రాజ్ ఆలయంలో భారత్​ యువతి”, “పాకిస్తాన్‌లో లగ్జరీ బస్సు నడిపిన భారత్​ అమ్మాయి” వంటి శీర్షికలతో వీడియోలు ఉన్నాయి.

    పాక్​ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్(former Pakisthani Prime Minister Nawaz Sharif) కుమార్తె మరియం నవాజ్ షరీఫ్‌ను జ్యోతి కలిసినట్లు ఇస్టాగ్రామ్ వీడియోలో లభ్యమైంది. పాక్​ నిఘా వర్గాల అధికారులతో టచ్‌లో ఉందని తేలింది. టెలిగ్రామ్, వాట్సాప్‌, స్నాప్‌చాట్‌ ఉపయోగించి భారత్​ ఆర్మీ(Indian Army)కి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్​కు చెరవేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

    READ ALSO  Minister Rajnath Singh | ఉగ్ర‌వాదం నుంచి ర‌క్షించుకోవ‌డం మా హ‌క్కు.. ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

    YouTuber Jyoti Malhotra : పాక్​ కోసం గూఢచర్యం

    పాక్​ కోసం గూఢచర్యం చేస్తూ, భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హరియాణాలో జ్యోతి మల్హోత్రా సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ(Pakistan’s intelligence agency ISI)కు చెందినవారితో సంప్రదింపులు జరుపుతున్నారని, శత్రుదేశానికి సున్నితమైన సమాచారం చేరవేస్తున్నారని అధికారులు తెలిపారు.

    YouTuber Jyoti Malhotra : జ్యోతి మల్హోత్రా బ్యాక్​గ్రౌండ్..

    జ్యోతి ఒక ట్రావెల్ బ్లాగర్‌. హరియాణాలోని హిసార్‌కు చెందినప్పటికీ ఆమె కుటుంబం ఢిల్లీలో నివాసం ఉంటోంది. యూట్యూబ్‌లో జ్యోతికి 3.7 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కాగా, పాక్​ నిఘా సంస్థకు చెందిన ఓ అధికారితో ఆమె సన్నిహిత సంబంధం కొనసాగించిందని, ఇండోనేషియా కూడా వెళ్లొచ్చిందని తెలిసింది.

    READ ALSO  Pahalgam terror attack | ప‌హల్​గామ్​ ఉగ్ర‌దాడి కేసులో ముంద‌డుగు.. ఇద్ద‌రు కీల‌క వ్య‌క్తుల‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ

    YouTuber Jyoti Malhotra : డానిష్ సూచనతో

    పాక్​ నుంచి భారత్‌కు వచ్చిన తర్వాత డానిష్‌తో జ్యోతి సంప్రదింపులు కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. అతడి సూచన మేరకు, అహ్వాన్‌ అనే వ్యక్తిని కలుసుకుందని చెప్పారు. పాక్‌ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను ఆమెకు సదరు వ్యక్తి పరిచయం చేశాడని తెలిసింది. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు తన పాకిస్తానీ కాంటాక్ట్‌ల వివరాలను ఇతర పేర్లతో సేవ్ చేసినట్లు ఆమె అంగీకరించినట్లు సమాచారం.

    ఈ మేరకు పోలీసులు.. జ్యోతి మల్హోత్రాకు చెందిన ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె బ్యాంకు ఖాతా లావాదేవీలను సేకరించారు.

    Latest articles

    Shefali Jariwala | తీవ్ర విషాదం.. కాంటాలగా సాంగ్ ఫేమ్ గుండె పోటుతో క‌న్నుమూత‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Shefali Jariwala : బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌(Bollywood film industry)లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఎంతో...

    West Indies Cricketer | ఆ క్రికెట‌ర్‌పై లైంగిక వేధింపుల కేసు.. ఏకంగా 11 మంది ఫిర్యాదు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: West Indies Cricketer : క్రికెట‌ర్స్ కొన్ని సార్లు లేని పోని వివాదాల‌లో చిక్కుకొని వారి...

    Today Gold Price | మ‌గువ‌ల‌కు శుభవార్త.. మరింత త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-చైనా China మధ్య వాణిజ్య ఒప్పందంపై...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 28 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శనివారంమాసం – ఆషాఢపక్షం...

    More like this

    Shefali Jariwala | తీవ్ర విషాదం.. కాంటాలగా సాంగ్ ఫేమ్ గుండె పోటుతో క‌న్నుమూత‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Shefali Jariwala : బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌(Bollywood film industry)లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఎంతో...

    West Indies Cricketer | ఆ క్రికెట‌ర్‌పై లైంగిక వేధింపుల కేసు.. ఏకంగా 11 మంది ఫిర్యాదు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: West Indies Cricketer : క్రికెట‌ర్స్ కొన్ని సార్లు లేని పోని వివాదాల‌లో చిక్కుకొని వారి...

    Today Gold Price | మ‌గువ‌ల‌కు శుభవార్త.. మరింత త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-చైనా China మధ్య వాణిజ్య ఒప్పందంపై...