అక్షరటుడే, ఇందూరు: Life imprisonment : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పరిధిలో 2007లో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో నిందితుడికి 18 ఏళ్లకు శిక్ష పడింది. పొరుగింటి వారితో జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారి హత్య వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఆర్మూర్ పరిధి మామిడిపల్లికి చెందిన దండుగుల తిర్మల్, అతని భార్య సావిత్రికి వీరి పొరుగున ఉన్న చంద్రకళతో గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో మే 8, 2007న రాత్రి సమయంలో భార్యాభర్తలు కలిసి చంద్రకళపై దాడి చేశారు. అనంతరం అదేరోజు అర్ధరాత్రి చంద్రకళ నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు.
ఈ కేసు గత 18 సంవత్సరాలుగా కొనసాగుతోంది. చివరికి సాక్ష్యాధారాలను పరిశీలించిన ఉమెన్స్ కమ్ ఫోర్త్ అడిషనల్ జడ్జి, న్యాయమూర్తి టి.శ్రీనివాస్ తుదితీర్పునిచ్చారు. నిందితుడు తిర్మల్ కు జీవిత కారాగార శిక్ష తోపాటు రూ.5 వేల జరిమానా విధించారు. జరిమానా కట్టని పక్షంలో మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.