More
    HomeజాతీయంPSLV-C61 | పీఎస్​ఎల్వీ - సీ61 కౌంట్​డౌన్​ ప్రారంభం

    PSLV-C61 | పీఎస్​ఎల్వీ – సీ61 కౌంట్​డౌన్​ ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PSLV-C61 | పీఎస్​ఎల్వీ- సీ61 (PSLV-C61) రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శనివారం ఉదయం 7.59 గంటలకు ప్రారంభమైన కౌంట్​డౌన్​ 22 గంటల పాటు కొనసాగనుంది. ఆదివారం ఉదయం ఉదయం 5.59 గంటలకు రాకెట్(Rocket)​ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా ఈవోఎస్​–9 (EOS-9) ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం గమనార్హం.

    ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్​ నారాయణన్‌(ISRO Chairman Narayanan) శుక్రవారం తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సూళ్లురుపేటలోని చెంగాలమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలలో GSLV-F16 రాకెట్ ప్రయోగం చేపడుతామన్నారు. ఈ ఏడాది నెలకో ప్రయోగం చేపడుతామని ఆయన వివరించారు.

    READ ALSO  Traffic control | అక్కడ ట్రాఫిక్​ నియంత్రణ.. ఉల్లంఘనులకు జరిమానా ఇక ఏఐతోనే..!

    PSLV-C61 | దేశ భద్రత కోసం..

    శ్రీహరి కోట(Srihari Kota)లోని షార్​ నుంచి ఈ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశ భద్రత, రక్షణ వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోపదపడేలా ఉపగ్రహాన్ని రూపొందించారు. ఈ శాటిలైట్​లో సీ-బ్యాడ్ సింథటిక్ అపార్చర్ రాడార్‌(Sea-Bed Synthetic Aperture Radar) అమర్చారు. దీంతో పగలు, రాత్రి సమయంలో వాతావరణ పరిస్థితులను తెలుసుకుంటారు. భూమి ఉపరితలంపై అధిక రిజల్యూషన్ కలిగిన ఫొటోలను సైతం దీంతో తీయవచ్చు. శత్రుదేశాల కదలికలు, ఉగ్రవాద శిబిరాలు వంటి వాటిని గుర్తించడానికి ఈ ప్రయోగం ఎంతగానో దోహదం చేయనుంది.

    ఇటీవల ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor)​ అనంతరం భారత్, పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. భారత్​ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయగా.. పాకిస్తాన్​ భారత సైనిక స్థావరాలపై దాడులకు యత్నించి విఫలైంది. అదే సమయంలో భారత్​ పాక్​లోని పలు ఎయిర్​బేస్​(Airbase)లను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్​ సమయంలో ఇస్రో కూడా కీలకంగా వ్యవహరించింది. ఉపగ్రహాల ద్వారా పాక్​ కార్యకలాపాలను తెలుసుకొని ఆర్మీ(Indian Army)కి అందజేసింది. పది ఉపగ్రహాలు సరిహద్దు భద్రత కోసం 24 గంటలు పని చేస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్​ తెలిపారు.

    READ ALSO  Vande Bharat Train | వందే భార‌త్‌ రైలులో వాటర్​ లీకేజీ.. వీడియో వైరల్​

    Latest articles

    IPS officer Parag Jain | రా చీఫ్ గా పరాగ్ జైన్..నిఘాను బలోపేతం చేయడంలో కీలక పాత్ర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPS officer Parag Jain | భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ ఏ...

    Police transfers | రాష్ట్రంలో 44 మంది డీఎస్పీల బదిలీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Police transfers | తెలంగాణ రాష్ట్రంలో ఏసీపీలు, డీఎస్పీలు బదిలీ (ACPs and DSPs transfers)...

    Vice President Dhankhar | ప్ర‌వేశిక‌ను మార్చ‌లేము కానీ.. 1976లోనే మార్చార‌ని గుర్తు చేసిన ధ‌న్‌ఖ‌డ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Vice President Dhankhar | రాజ్యాంగ ప్ర‌వేశిక మార్పుపై వివాదం నెల‌కొన్న త‌రుణంలో ఉప రాష్ట్ర‌ప‌తి...

    IAS Officers | రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్​లకు అదనపు బాధ్యతలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IAS Officers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్​ అధికారులు అదనపు...

    More like this