More
    HomeజాతీయంIndian Missiles | భార‌త క్షిప‌ణుల దెబ్బ త‌గిలింది.. అంగీక‌రించిన పాక్ ప్ర‌ధాని

    Indian Missiles | భార‌త క్షిప‌ణుల దెబ్బ త‌గిలింది.. అంగీక‌రించిన పాక్ ప్ర‌ధాని

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Missiles | ప‌హ‌ల్​గామ్​ దాడికి ప్ర‌తీకారంగా భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindoor)తో పాకిస్తాన్ వ‌ణికిపోయింది. వైమానిక‌ స్థావ‌రాల‌పై భార‌త్ విరుచుకు ప‌డ‌డంతో కాళ్ల భేరానికి వ‌చ్చింది. త‌మ‌కు న‌ష్టం జ‌రుగ‌లేద‌ని, భార‌త్ మిసైళ్ల‌ను(Indian missiles) కూల్చేశామ‌ని ఇన్నాళ్లు బుకాయించిన పాకిస్తాన్ ఇప్పుడు అస‌లు విష‌యాన్ని వెల్ల‌డించింది. భార‌త మిసైళ్లు వైమానిక స్థావ‌రాల‌పై ప‌డ్డాయ‌ని దాయాది ప్ర‌ధాన‌మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్(Pakistan Prime Minister Shehbaz Sharif) వెల్ల‌డించారు. రావల్పిండిలోని నూర్​ఖాన్ వైమానిక స్థావరం, ఇతర ప్రదేశాలపై భారతదేశం చేసిన కచ్చితత్వ క్షిపణి దాడిని షరీఫ్ అంగీకరించారు. మే 9, 10 తేదీలలో మధ్య రాత్రి 2:30 గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్(Army Chief General Asim Munir) స్వయంగా తనకు ఫోన్ చేసి ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన దాడి గురించి తెలియజేశారని వెల్లడించారు. శుక్ర‌వారం రాత్రి ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ మాన్యుమెంట్ వద్ద జరిగిన ప్రత్యేక ‘యుమ్-ఎ-తషాకూర్’ కార్యక్రమంలో షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు.

    READ ALSO  Dirham | దిర్హామ్‌తో పోల్చితే రూ.23.5కి పడిపోయిన రూపాయి విలువ.. ఉత్సాహంలో ప్రవాసీయులు

    Indian Missiles | భార‌త్ దాడి నిజ‌మే..

    మే 9, 10వ తేదీల్లో రాత్రి స‌మ‌యంలో రావ‌ల్పిండిలోని నూర్‌ఖాన్ స‌హా ఇత‌ర వైమానిక స్థావ‌రాల‌పై భార‌త్ దాడి చేసిన‌ట్లు పాక్​ ప్ర‌ధాని(Pakistan Prime Minister) అంగీక‌రించారు. ఆయ‌న ప్ర‌సంగానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఆ రోజు తెల్ల‌వారుజామున ప్రార్థ‌న‌లు ముగించుకుని స్విమ్మింగ్‌కు వెళ్లా. సెక్యూర్డ్ ఫోన్ మాత్ర‌మే తీసుకెళ్లా. రెండుసార్లు ఫోన్ మోగింది. ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఆసిమ్ మునీర్ లైన్‌లోకి వ‌చ్చి భార‌త్ దాడులు చేస్తున్న విష‌యాన్ని చెప్పార‌న్నారు. వాటిని ఎదుర్కొనేందుకు మన వైమానిక ద‌ళం స్వదేశీ సాంకేతిక‌త‌తో పాటు చైనా యుద్ధ విమానాల‌ను వినియోగిస్తోంద‌ని మునీర్ వివ‌రించార‌న్నారు. అయితే, భార‌త్‌పై ప్ర‌యోగించిన క్షిప‌ణులు, డ్రోన్లు కూలిపోయిన విష‌యాన్ని ఆయ‌న చెప్ప‌లేదు. “మే 9-10 తేదీల మధ్య రాత్రి 2.30 గంటల ప్రాంతంలో, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నాకు సెక్యూర్డ్ ఫోన్ చేసి, హిందుస్తానీ బాలిస్టిక్ క్షిపణులు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ మరియు ఇతర ప్రాంతాలను ఢీకొట్టాయని నాకు తెలిపారు. జనరల్ స్వరంలో విశ్వాసం, ఆత్మవిశ్వాసం, దేశభక్తి ఉందని నేను దేవునిపై ప్రమాణం చేయడం ద్వారా మీకు చెప్పగలనని” వివ‌రించారు.

    READ ALSO  Ajit Doval | ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు వీడాలి.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్

    Latest articles

    ACB Trap | ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ, బిల్​ కలెక్టర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. నిత్యం ఏసీబీ దాడులు...

    TV Anchor Swetcha | యాంక‌ర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్‌.. ఆమె ఆత్మహత్యకు అతనే కారణమన్న తల్లిదండ్రులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: TV Anchor Swetcha | టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు....

    DS Statue | డీఎస్​ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభానికి కేంద్రమంత్రి అమిత్ షా (Union...

    Journalist Vittal Vyas | జర్నలిస్ట్‌ విఠల్‌ వ్యాస్‌ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం

    అక్షరటుడే, ఇందూరు: Journalist Vittal Vyas | జమాల్‌పూర్‌ విఠల్‌ వ్యాస్‌ మెమోరియల్‌ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం జర్నలిస్‌...

    More like this

    ACB Trap | ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ, బిల్​ కలెక్టర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. నిత్యం ఏసీబీ దాడులు...

    TV Anchor Swetcha | యాంక‌ర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్‌.. ఆమె ఆత్మహత్యకు అతనే కారణమన్న తల్లిదండ్రులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: TV Anchor Swetcha | టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు....

    DS Statue | డీఎస్​ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభానికి కేంద్రమంత్రి అమిత్ షా (Union...