అక్షరటుడే, వెబ్‌డెస్క్: OnePlus 13 : స్మార్ట్ ఫోన్(smartphone) కొనాలని అనుకుంటున్నారా? తక్కువ ధరకే వన్‌ప్లస్ ఫోన్ కావాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఫ్లిప్‌కార్ట్(Flipkart) ఒక అద్భుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. తక్కువ ధరకే వన్‌ప్లస్ 13ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం, ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.8వేల కన్నా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్(premium flagship phone) కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఫోన్. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీకు ఆసక్తి ఉంటే.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఈ ఆఫర్ పూర్తి వివరాల కోసం ఇది చదివేయండి.
OnePlus 13 : సూపర్బ్ డీల్..
వినియోగదారులను ఎంతో ఆకట్టుకున్న స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ 13. మన మార్కెట్‌లో ఇది లాంచ్ అయిన సమయంలో ధర రూ.69,999గా ఉంది. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రూ.65,999కి లిస్ట్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ వన్‌ప్లస్ 13పై రూ.4వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.4,250 తగ్గింపును పొందవచ్చు.
OnePlus 13 : అద్భుతమైన ఫీచర్స్..
వన్‌ప్లస్ 13 ఫోన్ అధునాతన ఫీచర్స్(advanced features)తో స్మార్ట్‌ఫోన్ ప్రియులను తెగ ఆకర్షిస్తోంది. HDR10+ సపోర్ట్‌తో 6.82-అంగుళాల LTPO 3K డిస్‌ప్లే(LTPO 3K display)తో మంచి అనుభూతిని అందిస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. హుడ్ కింద ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్(premium flagship phone) స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్(Snapdragon 8 Elite chipset) ద్వారా పవర్ పొందుతుంది. 24GB వరకు LPDDR5X ర్యామ్(LPDDR5X RAM), 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే.. వన్‌ప్లస్ 13 ఫోన్ 50MP ప్రైమరీ షూటర్, 3x ఆప్టికల్ జూమ్(optical zoom)తో 50MP టెలిఫోటో లెన్స్(telephoto lens), 50MP అల్ట్రావైడ్ సెన్సార్(ultrawide sensor)ను కలిగి ఉంది.