అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Traffic Police | ట్రాఫిక్ పోలీసుల (Traffic Police) ఆధ్వర్యంలో నగరంలో వివిధ చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali), ఇన్స్పెక్టర్ ప్రసాద్ (Inspector Prasad) గురువారం వీటిని ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు కోర్టు సర్కిల్, రైల్వే స్టేషన్ (Nizamabad Railway Station) ఎదురుగా మోక్ష్ డ్రెస్సెస్ (Moksh Dresses) సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మోక్ష్ డ్రెస్సెస్ యజమాని ప్రవీణ్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.