More
    Homeఅంతర్జాతీయంOpreration Sindoor | భార‌త్ చేతిలో పాక్‌కు చావుదెబ్బ‌.. పెంట‌గాన్ మాజీ అధికారి వెల్ల‌డి

    Opreration Sindoor | భార‌త్ చేతిలో పాక్‌కు చావుదెబ్బ‌.. పెంట‌గాన్ మాజీ అధికారి వెల్ల‌డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Opreration Sindoor | సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని ఎగ‌దోస్తున్న పాకిస్తాన్‌(Pakistan)ను భార‌త్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ దేశ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థను ఛేదించ‌డ‌మే కాక వైమానిక స్థావ‌రాల‌ను ధ్వంసం చేసింది. ఆప‌రేష‌న్ సిందూరు(Operation Sindoor) కార‌ణంగా పాకిస్తాన్ దారుణంగా న‌ష్ట‌పోయింది. ఇక త‌మ వ‌ల్ల కాద‌ని, భార‌త్ మ‌రింత క‌న్నెర్ర చేస్తే క‌ష్ట‌మేన‌ని గుర్తించి శ‌ర‌ణు వేడింది. కాల్పుల విర‌మ‌ణకు ముందుకొచ్చింది. అయితే అప్ప‌టికే పాకిస్తాన్‌కు జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగి పోయింద‌ని అమెరికా పెంట‌గాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ (Michael Rubin)వెల్ల‌డించారు. భార‌త్ దాడులు నిలిపి వేశాక పాకిస్తాన్ “కాళ్ల మధ్య తోక పెట్టుకున్న కుక్కలా” దేబిరించింద‌ని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవలి పరిణామాలపై రూబిన్ ANIతో మాట్లాడారు. ఇండియా దౌత్యపరంగా, సైనికపరంగా గెలిచింద‌న్నారు. ఇప్పుడు అందరి దృష్టి పాకిస్తాన్ ఉగ్రవాద స్పాన్సర్‌షిప్‌పై ఉంద‌ని తెలిపారు.

    READ ALSO  Ajit Doval | ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు వీడాలి.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్

    Opreration Sindoor | మోక‌రిల్లిన పాక్‌..

    పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం ఖచ్చితమైన దాడులను నిర్వహించిందని రూబిన్ తెలిపారు. ఇండియా త‌న వైమానిక స్థావరాలను పనిచేయకుండా చేసిన తర్వాత “పాకిస్తాన్(Pakistan) కాళ్ల మధ్య తోకతో భయపడిన కుక్కలా కాల్పుల విరమణ కోసం ప్రయత్నించింది” అని రూబిన్ ఎద్దేవా చేశారు. ఇస్లామాబాద్ “చాలా ఘోరంగా ఓడిపోయింది” అనే వాస్తవం నుంచి పారిపోలేదని చెప్పారు. భారతదేశం కొట్టిన వ్యూహాత్మక దెబ్బను రూబిన్ హైలైట్ చేస్తూ.. “యూనిఫాంలో ఉన్న పాకిస్తాన్ అధికారులు ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన మాట వాస్తవం.. ఉగ్రవాది లేదా పాకిస్తాన్ సాయుధ దళాల మధ్య ఎటువంటి తేడా లేదని చూపిస్తుంది. ప్రాథమికంగా ప్రపంచం పాకిస్తాన్ తన సొంత వ్యవస్థ నుంచి తెగులును తొలగించాలని డిమాండ్ చేయబోతోంద‌ని” వెల్ల‌డించారు.

    READ ALSO  Qatar | ఖతార్ గగనతలం మూసివేత

    Opreration Sindoor | ఉగ్ర స్థావ‌రాల‌పైనే భార‌త్ దాడి..

    భార‌త్ యుద్ధాన్ని కోరుకోలేదని, ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పైనే తొలుత దాడి చేసింద‌ని రూబిన్ గుర్తు చేశారు.
    ఇండియా ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను, శిక్షణా శిబిరాలను ఖచ్చితత్వంతో నాశనం చేయగలిగింద‌ని మైఖేల్ చెప్పారు. కానీ పాకిస్తాన్ మాత్రం భార‌త పౌరులు(Indian Citizens), మిలిట‌రీ మౌలిక వ‌స‌తుల‌పై దాడి చేయ‌డానికి య‌త్నించింద‌న్నారు. పాక్ క‌వ్వించ‌డంతో భార‌త్ త‌న వ్యూహాన్ని మార్చింద‌ని, శ‌త్రువు వైమానిక సామర్థ్యాలను నిర్వీర్యం చేసిందని తెలిపారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ నాయకత్వం, సైనిక వ్యవస్థ అంతర్గత పని చేయకపోవడం గురించి పెంటగాన్ మాజీ అధికారి సీరియ‌స్ అంశాల‌ను లేవనెత్తారు. “స్పష్టంగా, పాకిస్తాన్ సైన్యం(Pakistan Army)లో ఒక సమస్య ఉంది, అది అసమర్థమైనది. ఇండియా చేతిలో చావుదెబ్బ తిన్న అసిమ్ మునీర్(Asim Munir) తన ఉద్యోగాన్ని కొనసాగిస్తారా? లేక రాజీనామా చేస్తారా?” చూడాల్సి ఉంద‌న్నారు. “పాకిస్తాన్ త‌న ఇంటిని శుభ్రపరచాల్సిన అవసరం ఉంది, కానీ వారు అలా చేయడానికి చాలా దూరం వెళ్తారా అనేది బహిరంగ ప్రశ్న” అని పేర్కొన్నారు.

    READ ALSO  GST refund scam | భారీ కుంభకోణం.. రూ.100 కోట్ల నకిలీ GST రీఫండ్ స్కామ్‌.. పలు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు

    Opreration Sindoor | ట్రంప్‌కు అల‌వాటే..

    ఏం జ‌రిగినా దాన్ని త‌న‌కు తాను క్రెడిట్ ఇచ్చుకోవ‌డం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌(US President Trump)న‌కు అల‌వాటేన‌ని రూబెన్ ఎద్దేవా చేశారు. భార‌త్‌, పాక్ మ‌ధ్య యుద్ధం త‌న వ‌ల్లే ఆగింద‌న్న ట్రంప్ వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న కొట్టిప‌డేశారు. భార‌తీయులు ట్రంప్ వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌పంచ‌క‌ప్ కొట్టింది తానేన‌ని, క్యాన్స‌ర్‌కు మందులు క‌నిపెట్టింది తానేన‌ని చెప్పుకోవ‌డం ట్రంప్‌కు అల‌వాటేన‌ని విమ‌ర్శించారు.

    Latest articles

    Uttar Pradesh | మ‌హిళ‌తో కలిసి బైక్​పై రిస్కీ స్టంట్స్.. వీడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఇటీవ‌లి కాలంలో రోజురోజుకూ బరితెగించేస్తున్నారు. సమాజమే సిగ్గుతో తలదించుకునేలా వారు చేస్తున్న...

    Mahaa News | మ‌హా న్యూస్ ఛానెల్‌పై దాడి.. ఖండించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ , లోకేష్‌, బండి సంజ‌య్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahaa News | హైదరాబాద్ నగరంలోని మహా న్యూస్ ఛానెల్ (Maha News) ప్రధాన కార్యాలయంపై...

    Himachal | భారీ వర్షాలతో వణికిపోతున్న హిమాచల్​ ప్రదేశ్​.. వరదలకు 31 మంది మృతి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Himachal : ఉత్తరాది రాష్ట్రాల్లో వరణుడు కుమ్మేస్తున్నాడు. కుండపోత వానలతో అల్లాడిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లో...

    Turmeric Board | పసుపు రైతులకు పండుగే..

    అక్షరటుడే, ఇందూరు : Turmeric Board | పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరడమే కాకుండా ఇందూరు కేంద్రంగా...

    More like this

    Uttar Pradesh | మ‌హిళ‌తో కలిసి బైక్​పై రిస్కీ స్టంట్స్.. వీడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఇటీవ‌లి కాలంలో రోజురోజుకూ బరితెగించేస్తున్నారు. సమాజమే సిగ్గుతో తలదించుకునేలా వారు చేస్తున్న...

    Mahaa News | మ‌హా న్యూస్ ఛానెల్‌పై దాడి.. ఖండించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ , లోకేష్‌, బండి సంజ‌య్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahaa News | హైదరాబాద్ నగరంలోని మహా న్యూస్ ఛానెల్ (Maha News) ప్రధాన కార్యాలయంపై...

    Himachal | భారీ వర్షాలతో వణికిపోతున్న హిమాచల్​ ప్రదేశ్​.. వరదలకు 31 మంది మృతి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Himachal : ఉత్తరాది రాష్ట్రాల్లో వరణుడు కుమ్మేస్తున్నాడు. కుండపోత వానలతో అల్లాడిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లో...