ePaper
More
    Homeబిజినెస్​Stock Market | 90 శాతం నష్టాలే.. అయినా ‘ఆప్షన్​’​ ట్రేడింగ్​లో తగ్గేదేలే అంటున్న ఇన్వెస్టర్లు..!

    Stock Market | 90 శాతం నష్టాలే.. అయినా ‘ఆప్షన్​’​ ట్రేడింగ్​లో తగ్గేదేలే అంటున్న ఇన్వెస్టర్లు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | ఆశ ప్రపంచాన్ని నడిపిస్తుంది. అత్యాశ అధ:పాతాళానికి తీసుకుపోతుంది. స్టాక్‌ మార్కెట్‌(Stock market)లో లాభాలను ఆర్జించవచ్చు. మార్కెట్‌ను అధ్యయనం చేసి, కంపెనీల పనితీరు చూసి పెట్టుబడులు పెడితే మంచి రాబడి పొందడానికి అవకాశాలుంటాయి. అయితే అత్యాశతో చాలామంది ఎలాంటి పరిశీలన చేయకుండానే ఈక్విటీ డెరివేటివ్స్‌(Equity Derivatives) సెగ్మెంట్‌లో భారీగా లాభాలు వస్తాయన్న ఉద్దేశంతో పెట్టుబడి పెట్టి నిండా మునుగుతున్నారు. సెబీ(SEBI) నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

    ఆప్షన్‌ ట్రేడింగ్‌ అన్నది అధిక రిస్క్‌(Risk)తో కూడుకున్నది. ఇందులో తొంభై శాతం నష్టపోతున్నారని తెలిసినా.. మిగిలిన పది మందిలో తానుంటానన్న అతి నమ్మకంతో చాలామంది ట్రేడింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. చివరికి భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) ఇటీవల వెలువరించిన నివేదిక(Report) ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌లో ఇండివిడ్యువల్‌ ట్రేడర్స్‌(Individual Traders)లో 91 శాతం నష్టపోయారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోనూ 90 శాతానికిపైగా వ్యక్తిగత ట్రేడర్లు నష్టాలను చవిచూశారు.

    READ ALSO  Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    2023-24 ఆర్థిక సంవత్సరం(Financial year)లో రూ. 74,812 కోట్లు నష్టపోయారు. ఒక్కో ట్రేడర్‌ సగటున రూ. 86,728 పోగొట్టుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ట్రేడర్ల మొత్తం నష్టాలు 41 శాతం పెరిగి రూ. 1.06 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఒక్కో ట్రేడర్‌(Trader) సగటు నష్టాలు 25 శాతం పెరిగి రూ.1.10 లక్షలకు పెరిగాయి. అయితే సెబీ తీసుకుంటున్న చర్యలతో ఆప్షన్‌ ట్రేడింగ్‌(Option trading)లో పాల్గొనేవారి సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది.

    Stock Market | సెబీ చర్యలతో తగ్గిన ట్రేడర్లు..

    ఆప్షన్స్‌లో వ్యక్తిగత ట్రేడర్లు భారీగా నష్టపోతుండడంతో సెబీ కొన్ని కఠినమైన నిబంధనలు తీసుకువచ్చింది. ఈక్విటీ ఇండెక్స్‌ డెరివేటివ్స్‌ ఫ్రేమ్‌వర్క్‌(Frame work)ను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంది. ఇందులో రిస్క్‌ మానిటరింగ్‌, డిస్​క్లోజర్‌ను మెరుగుపరచడం, సింగిల్‌ స్టాక్స్‌పై డెరివేటివ్స్‌ బ్యాన్‌ పీరియడ్స్‌ను తగ్గించడం, ఇండెక్స్‌ ఆప్షన్స్‌లో మానిపులేషన్‌ రిస్క్‌పై నిఘా పెంచడం వంటివి ఉన్నాయి. ఇవి గతేడాది అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో ఆప్షన్స్‌లో పాల్గొనేవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 96 లక్షల మంది యునిక్‌ ట్రేడర్లు ఈ సెగ్మెంట్‌లో పాల్గొన్నారు. ఇది అంతకుముందు సంవత్సరం కంటే 20 శాతం తక్కువ. ఆప్షన్స్‌లో అధిక రిస్క్‌(High risk) ఉన్నందున అత్యంత జాగ్రత్తగా ఉండాలని సెబీ సూచిస్తోంది.

    READ ALSO  Gold Price | షాక్​ ఇచ్చిన గోల్డ్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన ధరలు.. ఈ రోజు తులం ఎంతంటే..

    Latest articles

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    More like this

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...