More
    Homeక్రీడలుIPL 2025 | ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్‌కే ఔట్.. ఆ ఐదుగురు ఆటగాళ్లపై...

    IPL 2025 | ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్‌కే ఔట్.. ఆ ఐదుగురు ఆటగాళ్లపై వేటు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) పోరాటం ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు అధికారికంగా తప్పుకుంది. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇది ఆ జట్టుకు 8వ పరాజయం. సీఎస్‌కే మరో 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిచినా ప్లే ఆఫ్స్ చేరలేదు. ఈ క్రమంలోనే సీఎస్‌కే వచ్చే సీజన్‌పై ఫోకస్ పెట్టింది.

    టీమ్‌కు అవసరమయ్యే ఆటగాళ్లు ఎవరు? భారంగా మారిన ప్లేయర్లు ఎవరు? అనేది తెలుసుకోవడంపై కార్యచరణ మొదలు పెట్టింది. ధోనీ ms dhoni కూడా వచ్చే ఏడాదికి సంబంధించిన సన్నాహకాలు మొదలు పెడుతామని ఇప్పటికే స్పష్టం చేశాడు. కుర్రాళ్లకు అవకాశం ఇస్తామని తెలిపాడు.

    ఆపరేషన్ సీఎస్కే operation CSK పేరిట.. జట్టుకు భారంగా మారిన ఐదుగురి ఆటగాళ్లపై వేటు పడనుంది. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సామ్ కరణ్‌, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్‌లపై యాజమాన్యం వేటు వేయనుంది. వారిని అప్‌కమింగ్ సీజన్ వేలం ముందు జట్టు నుంచి రిలీజ్ చేయనుంది. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో రవిచంద్రన్ అశ్విన్‌ ashwin ను రూ.9.75 కోట్ల భారీ ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. ఆరంభంలో వరుస మ్యాచ్‌ల్లో అవకాశాలు ఇచ్చింది. కానీ అతను దారుణంగా విఫలమయ్యాడు. చివరకు తుది జట్టులో చోటు కోల్పోయాడు.

    దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్‌లు సైతం జట్టుకు భారంగా మారారు. టెస్ట్ తరహా బ్యాటింగ్‌తో చెన్నై విజయవకాశాలు దెబ్బతీశారు. ఆల్‌రౌండర్ సామ్ కరణ్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే ఈ ఐదుగురి ఆటగాళ్లకు సీఎస్‌కే ఉద్వాసన పలకాలనుకుంటుంది.

    Latest articles

    Hailstorm | హైదరాబాద్​లో వడగళ్లు..కుమ్మేసిన క్యుములోనింబస్​

    అక్షరటుడే, హైదరాబాద్: Hailstorm : హైదరాబాద్​ లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. రాజేంద్రనగర్‌,...

    earthquake | అర్జెంటీనాలో భారీ భూకంపం..రిక్టర్​ స్కేల్​పై 5.4 తీవ్రత నమోదు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: earthquake : దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 5.4గా...

    Vijay Devarakonda | రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వారిని అవమానించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. కేసు న‌మోదు

    అక్షరటుడే, హైదరాబాద్: Vijay Devarakonda : రౌడీబాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ vijay devarakonda వివాదాలు కొత్తేమి కాదు. ఎప్పుడు...

    Indian Premier League 2025 | రోబో డాగ్ వ‌ల‌న బీసీసీఐకి లేని పోని చిక్కులు.. ఏకంగా హైకోర్టు నోటీసులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Premier League 2025 : ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో అనేక హైలైట్స్ చోటు చేసుకుంటుండ‌టం మ‌నం...

    More like this

    Hailstorm | హైదరాబాద్​లో వడగళ్లు..కుమ్మేసిన క్యుములోనింబస్​

    అక్షరటుడే, హైదరాబాద్: Hailstorm : హైదరాబాద్​ లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. రాజేంద్రనగర్‌,...

    earthquake | అర్జెంటీనాలో భారీ భూకంపం..రిక్టర్​ స్కేల్​పై 5.4 తీవ్రత నమోదు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: earthquake : దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 5.4గా...

    Vijay Devarakonda | రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వారిని అవమానించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. కేసు న‌మోదు

    అక్షరటుడే, హైదరాబాద్: Vijay Devarakonda : రౌడీబాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ vijay devarakonda వివాదాలు కొత్తేమి కాదు. ఎప్పుడు...
    Verified by MonsterInsights