అక్షరటుడే, వెబ్‌డెస్క్:Terror Attack |కశ్మీర్‌లోని పహల్గామ్(Pahalgam)లో ఉగ్రదాడిలో ఉగ్రవాదుల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సెలవుల్లో ఆనందంగా గడపడానికి వెళ్లిన పర్యాటకులను టెర్రరిస్టులు(Terrorists) కనికరం లేకుండా కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌రావుపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఆయన శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లు సమాచారం. దీనిని బట్టి టెర్రరిస్టులు ఎలా రెచ్చిపోయారో తెలుస్తుంది. కాగా మధుసూదన్‌రావు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. కుటుంబంతో కలిసి కశ్మీర్(Kashmir) అందాలను చూడటానికి వెళ్లి ఉగ్రదాడిలో మృతి చెందాడు.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర కేబినెట్(Central Cabinet) అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ మేరకు మంత్రులు(Ministers) ఢిల్లీకి బయలు దేరారు. ఇప్పటికే ప్రధాని మోదీ(Prime Minister Modi) తన సౌదీ అరేబియా పర్యటను అర్ధంతరంగా ముగించుకొని తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశం అయ్యారు. ఘటనపై వివరాలు ఆరా తీశారు. అయితే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.