అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bihar Elections | బీహార్ సీఎం నితీష్‌కుమార్ (Bihar CM Nitish Kumar) సంచలన ప్రకటన చేశారు. త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్న నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో శాశ్వత నివాసితులుగా ఉన్న మహిళలకు 35 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని ఆయన తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని రకాల పోస్టులకు దీనిని వర్తింపచేస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు.
Bihar Elections | మొదలైన ఎన్నిక వేడి
బీహార్‌లో ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2015 నుంచి నితీశ్‌కుమార్ సీఎంగా కొనసాగుతున్నారు. గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఆయన తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్ సాయంతో సీఎం అయ్యారు. అనంతరం ఆర్జేడీతో తెగదింపులు చేసుకొని మళ్లీ ఎన్డీఏ పక్షాన చేరారు. అయితే సీఎం పదవి కోసం ఆయన అటు ఇటు తిరగడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అంతేగాకుండా ఆయన 2015 నుంచి సీఎంగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష ఆర్జేడీ(RJD), కాంగ్రెస్ కూటమి ఎలాగైనా అధికారంలోకి రావాలని యత్నిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ అధికారం దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్న నితీశ్‌కుమార్ తాజాగా రిజర్వేషన్ అస్త్రాన్ని ప్రయోగించారు.
Bihar Elections | తీవ్రంగా పోటీ
బీహార్‌లో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్ జత కట్టనున్నట్లు సమాచారం. అలాగే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(Prashant Kishore) కూడా జన్ సురాజ్ పార్టీ(Jan Suraj Party)ని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోకున్నారు. ఈ క్రమంలో పోటీ తీవ్రంగా ఉండనుంది. అధికారానికి దూరంగా ఆర్జేడీ ఎలాగైనా సీఎం పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. దీంతో సీఎం నితీశ్‌కుమార్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పలు పథకాలు ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మహిళలకు 35శాతం రిజర్వేషన్లు (35 Percent Reservation For Womens) అమలు చేస్తామని ప్రకటించారు.
ఇప్పటికే మహిళలకు పెన్షన్‌ను ఎన్డీఏ సర్కారు పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రూ.400గా ఉన్న పెన్షన్‌ను రూ.1100లకు పెంచుతూ సీఎం నితీశ్‌కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 10న పెరిగిన పింఛన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందని ఆయన పేర్కొన్నారు.
Bihar Elections | యువజన కమిషన్ ఏర్పాటు
మహిళలతో పాటు యువ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నితీశ్‌కుమార్ ప్రణాళిక వేశారు. ఇందులో భాగంగా బీహార్ యువజన కమిషన్(Bihar Youth Commission) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిషన్ ద్వారా యువకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి.. ఉద్యోగాలు కల్పించడమే ఈ కమిషన్ ఉద్దేశం అన్నారు.
Bihar Elections | మోదీ, రాహుల్ పర్యటనలు
బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇటీవల మోదీ బీహార్‌లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. రాహుల్ గాంధీ సైతం ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యపై రాహుల్ స్పందిస్తూ.. బీహార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గుండాల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.