అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold Seized | గుజరాత్‌లోని సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (International Airport) కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. అక్రమంగా పసిడిని పేస్ట్ రూపంలో తీసుకు వస్తున్న దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.25.57 కోట్ల విలువైన 24.8 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Gold Seized | పేస్ట్‌గా మార్చి..
బంగారం స్మగ్లింగ్ (Gold Smuggling) చేయడానికి అక్రమార్కులు కొత్త కొత్త దారులు వెతుకున్నారు. బంగారాన్ని పేస్ట్ (Gold Paste) రూపంలో మార్చి అక్రమంగా తీసుకు వస్తున్నారు. తాజాగా దుబాయి నుంచి వచ్చిన దంపతులు పసిడిని పేస్ట్‌గా మార్చిలో దుస్తులు, షూలలో పెట్టుకొని వచ్చారు. అయితే వారి తీరుపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు (Customs officers) తనిఖీలు చేపట్టారు. దీంతో 24.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. జులై 20న నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో కోసాద్ అమ్రోలిలోని సంస్కార్ రెసిడెన్సీ (Amroli Sanskar Residency) ప్రాంతానికి చెందిన దంపతులను అరెస్ట్ చేశారు. ప్యాంటు, ఇన్నర్‌వేర్, హ్యాండ్‌బ్యాగులు, షూలలో దాచిన బంగారాన్ని సీజ్ చేశారు.