అక్షరటుడే, ఇందూరు:Orchid School | నగరంలోని న్యాల్కల్ రోడ్లోని ఆర్చిడ్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో(10th Results) తమ సత్తా చాటారు. అక్షర(Akshara) 582 మార్కులు, ప్రణీత(Pranitha) 573, రుచిక(Ruchika) 571 మార్కులు కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ క్రాంతి(School Correspondent Kranthi) మాట్లాడుతూ.. పదో తరగతిలో తమ పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన ఎంతో తోడ్పడిందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.