అక్షరటుడే, హైదరాబాద్: Reels : మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రీల్స్ చేస్తూ ఓ యువకుడు దుర్మరణం చెందాడు. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం అటవీ ప్రాంతంలో గల నీటి క్వారీలో పడి తరుణ్ (17) అనే యువకుడు మృతి చెందాడు.
మేడ్చల్ జిల్లా, కౌకూర్ భరత్ నగర్ కాలనీకి చెందిన ఆరుగురు యువకులు రీల్స్ చేయడం కోసం కెమెరా తీసుకొని జవహార్ నగర్ లోని అడవి ప్రాంతంలో గల క్వారీకి వెళ్లారు. అక్కడ ఫొటోషూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు క్వారీలోని నీటి గుంతలో తరుణ్ పడిపోయాడు. ఈత రాకపోవడంతో అందులోనే మునిగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.