అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa Commissioner | హైదరాబాద్ నగరంలో గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు జలమయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydraa Commissioner Ranganath) బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జలమయం అయిన రోడ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలలో నీట మునుగుతున్న రహదారులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. డి వాటరింగ్ పంపులు పనిచేయక కొత్తగూడ (Kothaguda) చౌరస్తాలో ఆర్యూబీలో నీరు నిలిచిన విషయం తెలిసిందే. దానిపై ఆయన ఆరా తీశారు. ప్రస్తుతం మోటార్లకు మరమ్మతులు చేయించడంతో ఎలాంటి ఇబ్బంది లేదని సిబ్బంది తెలిపారు. ఆర్యూబీ వద్ద హైడ్రా పంపులను కూడా సిద్ధంగా ఉంచాలని కమిషనర్ ఆదేశించారు.
Hydraa Commissioner | సమన్వయంతో పని చేయాలి
ట్రాఫిక్ పోలీసులతో హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ (Hydraa Monsoon Emergency), డీఆర్ఎఫ్ బృందాలు (DRF Teams) కలిసి పని చేయాలని కమిషనర్ రంగనాథ్ సూచించారు. వరద ముప్పు ప్రాంతాల్లో నిరంతరం సేవలందించే స్టాటిక్ టీమ్లు ట్రాఫిక్ పోలీసులకు (Traffic Police) అందుబాటులో ఉండాలన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ట్రాఫిక్ జాయింట్ సీపీ గజరావు భూపాల్తో పాటు హైడ్రా కమిషనర్ బయోడైవర్సిటీ ప్రాంతంలో నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించారు. వంతెనల మీద కూడా నీరు పోయే రంధ్రాల్లో మట్టి చేరకుండా చూడాలని ఆదేశించారు.
గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రధాన రహదారి మీదుగా వచ్చిన వరద వెళ్లే నాలా కబ్జా అయిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో వరద నీరు గమన్ హాస్పిటల్ (Gaman Hospital) లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతుందని వాపోయారు. దీంతో ఆ నాలాను పునరుద్ధరించాలని కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.