అక్షరటుడే, వెబ్‌డెస్క్: CI Suspended | హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి(Uppal CI Election Reddy)ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association) లో అనేక అక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే హెచ్‌సీఏ స్కామ్‌లో సీఐ ఎలక్షన్ రెడ్డి తలదూర్చారు. దీంతో అధికారులు ఆయనపై వేటు వేశారు.
CI Suspended | సమాచారం లీక్ చేసినందుకు..
హెచ్‌సీఏ వివాదంలో ఇటీవల అధ్యక్షుడు జగన్మోహన్రావు (President Jaganmohan Rao)తో పాటు పలువురిని సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. ఇందులో భాగంగా హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజు అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు(CID Officers) ఏర్పాట్లు చేశారు. అయితే ఆ సమాచారాన్ని సీఐ ఎలక్షన్‌రెడ్డి ముందుగానే దేవరాజు(Devaraju)కు చెప్పారు. దీంతో CID సమాచారాన్ని లీక్ చేసినందుకు సీఐపై సస్పెన్షన్ వేటు పడింది.
CI Suspended | ఆరు రోజుల కస్టడీకి అనుమతి
హెచ్‌సీఏలో అక్రమాలకు పాల్పడిన కేసులో అరెస్టయిన అధ్యక్షుడు జగన్మోహన్రావుతో పాటు మిగతా వారిని సీఐడీ కస్టడీకి తీసుకుంది. జ్యూడీషియల్ రిమాండ్(Judicial Remand)లో ఉన్న వారిని కస్టడీకి అప్పగించాలని సీఐడీ కొరగా మల్కాజిగిరి కోర్టు(Malkajgiri Court) ఆరు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో వారిని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాలపై అధికారులు విచారణ చేయనున్నారు.