అక్షరటుడే, కామారెడ్డి: Tiger | రామారెడ్డి మండలంలో పెద్దపులి, చిరుత సంచరిస్తున్న విషయం తెలిసిందే. పెద్దపులి కోసం అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పులి సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు గ్రామాల్లో చాటింపు వేయిస్తున్నారు. ‘పెద్దపులి, చిరుత పులులు తిరుగుతున్నాయ్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దు’ అంటూ చాటిస్తున్నారు.
Tiger | వారం రోజులుగా గ్రామాల్లో హడల్..
రామారెడ్డి (Ramareddy) మండలంలో వారం రోజులుగా పెద్దపులి, చిరుత పులుల సంచరిస్తున్నాయి. ఇప్పటికే అధికారులు పులుల జాడ కోసం గాలిస్తున్నారు. తాజాగా చిరుత పులి లేగ దూడపై దాడి చేయడంతో గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాలు తండాలలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Tiger | రాత్రివేళ బయటకు వెళ్లొద్దు..
అత్యవసరమైతే తప్ప గ్రామస్థులు రాత్రివేళ్లలో బయటకు రావొద్దని అటవీశాఖ అధికారులు (Farest Department) సూచిస్తున్నారు. పులులు చీకట్లోనే దాడులు చేసే అవకాశముందని వారు పేర్కొంటున్నారు. పులి ఆవుపై, చిరుత లేగదూడపై రాత్రివేళల్లోనే దాడి చేసిందని గుర్తుచేశారు. అన్నారం (Annaram), రెడ్డిపేట తండాలో (Reddypeta Thanda) ఇదే విషయాన్ని శుక్రవారం దండోరా ద్వారా, మైకు ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.