అక్షరటుడే, వెబ్‌డెస్క్:IPL | ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పటికే సగం సీజన్(season) పూర్తయింది. పలువురు బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తుంటే, మరికొందరు బాల్‌తో మాయ చేస్తున్నారు. కొందరు ఆటగాళ్లు బంతిని బౌండరీలకు దాటిస్తుందటే.. బౌలర్లు యార్కర్లతో వికెట్లను గింగిరాలు తిప్పుతున్నారు. ఆఖరు ఓవరు వరకు గెలుపు ఎవరిదో తెలియకుండా చాలా మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అత్యధిక పరుగులు, వికెట్లు(wickets) తీసిన ప్లేయర్ల గురించి తెలుసుకుందాం.
IPL | అత్యధిక పరుగులు చేసింది వీరే..
గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఓపెనర్ సాయిసుదర్శన్ ఈ సీజన్లో ఇప్పటి వరకు టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఆయన 417 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో లక్నో ఆటగాడు నికోలస్ పూరన్ 377, గుజరాత్ ప్లేయర్(Gujarat Player) బట్లర్ 356 ఉన్నారు.
IPL | ఎక్కువ వికెట్లు వీరికే..
ఈ సీజన్లో పలు లోస్కోర్ మ్యాచ్‌లు కూడా నమోదు అయ్యాయి. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు తీస్తూ.. పరుగులను కట్టడి చేశారు. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) బౌలర్ ప్రసిద్ కృష్ణ అత్యధికంగా 16 వికెట్లు తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఆటగాడు కుల్దీప్ యాదవ్ 12, చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ 12 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
IPL | బౌండరీల బాసులు వీరే..
ఐపీఎల్(IPL)లో ఇప్పటి వరకు నికోలస్ పూరన్ (లక్నో) 31 సిక్స్‌లతో టాప్‌లో ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్(పంజాబ్) 20, మిచెల్ మార్ష్(లక్నో) 18 సిక్సర్లు కొట్టారు. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 42 ఫోర్లతో మొదటి స్థానంలో ఉండగా, బట్లర్(గుజరాత్) 40, మిచెల్ మార్ష్(లక్నో) 33 ఫోర్లు కొట్టారు.