అక్షరటుడే, కామారెడ్డి: Finance companies | జిల్లాలో ఫైనాన్స్ కంపెనీల వేధింపుల Finance companies పర్వం కొనసాగుతూనే ఉంది. దేవునిపల్లిలోని Devunipalli ఓ ఫైనాన్స్ కాల్‌సెంటర్ ఏజెంట్.. భార్యాభర్తలను దుర్భాషలాడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కామారెడ్డి Kamareddy మండలం గుర్గుల్ Gurgle గ్రామానికి చెందిన అనిత రెండేళ్ల క్రితం ఓ ఫైనాన్స్ కంపెనీలో రూ.1.75 లక్షల రుణం తీసుకుంది. రెగ్యులర్‌గా కడుతున్నప్పటికీ ఏప్రిల్ మాసంలో 15 రోజులు లేటయ్యింది. దీంతో కాల్‌సెంటర్ Call center ఏజెంట్ తమకు ఫోన్ చేసి వేధింపులకు గురిచేశారని బాధితురాలు ఆరోపించింది. తరచూ ఫోన్లు చేస్తూ భార్యభర్తలను దుర్భాషలాడారని వాపోయింది. కాల్‌సెంటర్‌కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు రాగా.. అక్కడ కూడా తమపై తిట్ల పురాణం అందుకున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Finance companies | ఆటో డెబిట్ కావట్లేదని చెప్పినా..
పాల్వంచ Palvancha మండలం ఇసాయిపేట Isaipet village గ్రామానికి చెందిన ఉప్పు చంద్రశేఖర్ అదే ఫైనాన్సులో కారు కోసం రూ.5 లక్షలు రుణం తీసుకున్నాడు. 14 నెలలుగా రెగ్యులర్‌గా కిస్తీ కడుతున్నాడు. చివరి ఈఎంఐ రెండురోజులు ఆలస్యం కావడంతో కాల్‌సెంటర్ ఏజెంట్ Agent ఫోన్‌చేసి దుర్భాషలాడాడని వాపోయారు. ఈ ఇద్దరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.