అక్షరటుడే, వెబ్డెస్క్: NTR District | తన చావుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి(TDP MLA Kolikapudi) కారణం అంటూ నీటిపారుదల శాఖ ఏఈ(Irrigation Department AE) సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా తిరువూరు ఏఈగా పని చేస్తున్న వి. కిశోర్ శనివారం ఉదయం సూసైడ్ నోట్(Suicide Note) రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
NTR District | రిలీవ్ చేయకుండా అడ్డుకున్నారు
తన చావుకు ఈఈ రంగయ్య, డీఈఈ ఉమాశంకర్, ఈఎన్సీ శ్యామ్ ప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులే కారణమని సూసైడ్ నోట్ రాశాడు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్(Deputy CM Pawan), లోకేష్, నిమ్మల రామానాయుడిని ఆయన కోరారు. తనను బదిలీ చేసి రిలీవ్ చేయకుండా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన రిలీవింగ్ను తిరువూరు ఎమ్మెల్యే ఆదేశాలతోనే అడ్డుకున్నారని ఆయన ఆ లేఖలో ఆరోపించారు. తన బదిలీని రాజకీయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
NTR District | తిరిగి తిరిగి అలసిపోయా
తన రిలీవింగ్(Releaving) కోసం అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయానని సూసైడ్ నోట్లో కిశోర్ పేర్కొన్నారు. ఒక దళిత ఉద్యోగిగా తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దన్నారు. తనకు వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాశాడు. అనంతరం ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా కనిపించకపోవంతో కుటుంబ సభ్యులు ఆందోలన చెందుతున్నారు.