అక్షరటుడే, లింగంపేట: MLA Madan Mohan Rao | మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. శుక్రవారం లింగంపేట (Lingmapet) మండల కేంద్రంలోని జీఎన్ఆర్ గార్డెన్లో (GNR Gardan) నిర్వహించిన నియోజకవర్గ ఇందిర మహిళ శక్తి సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
MLA Madan Mohan Rao | అన్నిరంగాల్లో మహిళలు ముందుండాలి..
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఉద్దేశంతో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు బాధ్యతను ఎక్కువ మొత్తంలో మహిళా సంఘాలకే (Women’s groups) అప్పగించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం మహిళ సంఘాలకు బ్యాంక్ లింకేజ్ (Bank linkage) ద్వారా రూ.20 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేశారు. మహిళా సంఘాల సభ్యులకు కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సెర్ప్ డైరెక్టర్ శ్రీ గోపాల్ రావు, డీఆర్డీవో (DRDO) సురేందర్, అడిషనల్ ఏపీడీ విజయలక్ష్మి, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ (Yella Reddy Market Committee) ఛైర్మన్ రజిత వెంకట్రామ్ రెడ్డి, వైస్ ఛైర్మన్ రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారా గౌడ్, లింగంపేట్ పాక్స్ ఛైర్మన్ దేవేందర్, డీపీఎంలు శ్రీనివాస్, సురేష్, సాయిలు, రాజయ్య, శోభారాణి, రాజేందర్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షుడు పుష్ప, మండల సమాఖ్య లింగంపేట్ అధ్యక్షుడు సులోచన, ఎల్లారెడ్డి నియోజకవర్గం మహిళా సమాఖ్య అధ్యక్షుడు మహిళా సంఘాల సభ్యులు ఏపీఎంలు సీసీలు, వీఓఏలు యంయస్ సిబ్బంది పాల్గొన్నారు.