అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Air India | విమానాల్లో సాంకేతిక లోపాలతో (Technical Issue) ప్రయాణికులు హడలిపోతున్నారు. ఫ్లైట్ (Flight) ఎక్కాలంటనే భయపడుతున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) తర్వాత వరుసగా సాంకేతిక సమస్యలతో విమానాలు నిలిచిపోవడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వంటి ఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. దీంతో విమాన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
హైదరాబాద్ నుంచి ఫుకెట్ (Hyderabad – Phuket) వెళ్తున్న విమానంలో సమస్య వచ్చింది. టేకాఫ్ అయిన వెంటనే పైలెట్ సమస్య గుర్తించారు. దీంతో హైదరాబాద్‌లోనే ల్యాండ్ చేశాడు. కాగా అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం కూలిపోగా.. ఈ ఘటనలో 270 మంది మృతి చెందారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు.
Air India | వరుస ఘటనలతో కలవరం
విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానంలో సమస్య తలెత్తింది. ఫ్లైట్‌లోని ఒక ఇంజిన్‌లో సమస్య రావడంతో పైలెట్ పాన్ కాల్ (Pan Call) ఇచ్చారు. అనంతరం ముంబయిలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇలాంటి ఘటనలో ప్రయాణికులు ఆందోళన చెందడంతో పాటు ఎయిర్ లైన్ సంస్థలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే అన్ని తనిఖీలు చేసి విమానాన్ని ప్రయాణానికి అనుమతించాలని కోరుతున్నారు.