అక్షరటుడే, ఇందూరు: Intermediate Education | అధ్యాపకులు సమయపాలన పాటిస్తూ.. విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని ఇంటర్ విద్యాధికారి రవికుమార్ (Inter Education Officer Ravikumar) తెలిపారు. నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను (Government Girls Junior College) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతుల నిర్వహణ, అధ్యాపకుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలు గతేడాది కంటే ఎక్కువ అడ్మిషన్లు చేయడం అభినందనీయమన్నారు.
Intermediate Education | వందశాతం ఫలితాలు సాధించాలి
కళాశాలలో వంద శాతం ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే అధ్యాపకులు కృషి చేయాలని డీఐఈవో సూచించారు. ఇంటర్మీడియట్ బోర్డు (Intermediate Board) సూచించిన టైంటేబుల్ ప్రకారం తరగతులు నిర్వహించాలని తెలిపారు. అధ్యాపకేతర సిబ్బంది, అడ్మిషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు.
ప్రతి విద్యార్థి డేటాను కంప్యూటర్లో నిక్షిప్తం చేయడంతో పాటు అపార్ నంబర్ల (Apar Numbers) పనిని పూర్తి చేయాలన్నారు. అలాగే కళాశాలలో అవసరమైన మరమ్మతులు, ఫర్నిచర్, విద్యుత్ మరమ్మతులు చేయించాలన్నారు. ఇందుకుగాను ఇంటర్ బోర్డు నిధులను కేటాయించిందన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ ఉన్నారు.