అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sharukh Khan | బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ప్రమాదానికి గురైనట్టు బీటౌన్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆయన నటిస్తున్న ‘కింగ్’ సినిమా(King Movie) షూటింగ్ సమయంలో ఓ యాక్షన్ సన్నివేశాన్ని డూప్ లేకుండా స్వయంగా చేస్తుండగా ఆయన గాయపడ్డట్టు తెలుస్తోంది. స్వల్పంగా కండరాల నొప్పితో షారూఖ్ బాధపడుతున్నట్లు సమాచారం. అత్యవసర చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. షారూఖ్ (Sharukh Khan) గాయపడడంతో ‘కింగ్’ మూవీ షూటింగ్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేసినట్టు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Sharukh Khan | గాయం నిజమేనా?
‘పఠాన్’, ‘జవాన్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన షారుక్ ఖాన్, ఈసారి తన కూతురు సుహానా ఖాన్‌తో కలిసి ‘కింగ్’ అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వార్’, ‘ఫైటర్’ వంటి హిట్ సినిమాలను రూపొందించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం (Director Siddharth Anand) వహిస్తున్నారు. ఇందులో సుహానా తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ రాణీముఖర్జీ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. గత కొన్ని నెలలుగా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుండగా, ఇప్పుడు షారుక్ గాయం కారణంగా తాత్కాలిక బ్రేక్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారం, తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
షారుక్ త్వరగా కోలుకొని తిరిగి షూటింగ్‌లో జాయిన్ కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ‘కింగ్’ సినిమా సెట్స్‌లో షారుఖ్‌కు గాయాలయ్యాయని, ఒక నెల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారనే ప్రచారం కూడా నడుస్తుంది. అయితే ఆ వార్తలు విన్న షారుఖ్ అభిమానులు ఆందోళన చెందుతుండగా, బాలీవుడ్ మీడియా ఎవరు ఆందోళన పడక్కర్లేదని అంటున్నారు. మరోవైపు ఈ వార్తలకు సంబంధించి షారుఖ్ ఖాన్ పర్సనల్ మేనేజర్ పూజ దాద్లానీ (Pooja Dadlani) కూడా ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అందరు కాస్త టెన్షన్‌లో ఉన్నారు.