అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: దోమకొండ(Domakonda) మండలకేంద్రంలో మంగళవారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు అనంతరెడ్డి మాట్లాడుతూ.. ప్రాణహిత చేవెళ్ల పథకం(Pranahitha Chevella) పాత డిజైన్ ప్రకారమే చేపట్టేందుకు రూ.23 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరంగా మార్చి పూర్తిగా రద్దు చేయాలని కుట్ర పన్నిందన్నారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పాత డిజైన్ ప్రకారమే ముందుకెళ్తోందన్నారు. తద్వారా 2.8 టీఎంసీల సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి, సిద్ధ రాములు, స్వామిగౌడ్, షమ్మీ, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Shabbir Ali | షబ్బీర్ అలీ చిత్రపటానికి పాలాభిషేకం
3