అక్షరటుడే, వెబ్డెస్క్ : KRCL Notification | పదో తరగతి (Tenth class) విద్యార్హతతో రైల్వే శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL)లో గ్రూప్–డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
పోస్టుల వివరాలు..
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 79
ట్రాక్ మెయింటైనర్ : 35
పాయింట్స్‌మన్ : 44
విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
వయో పరిమితి: 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు.
వేతనం : నెలకు రూ. 18 వేలు (మూల వేతనం + ఇతర అలవెన్సులు)
ఎంపిక విధానం : రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్(Online)లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు గడువు: వచ్చేనెల 12.
పూర్తి వివరాలకు https://konkanrailway.com లో సంప్రదించండి.