అక్షరటుడే, వెబ్‌డెస్క్: Movie Review | నూతన నటీనటులతో రానా దగ్గుబాటి సమర్పణలో రూపొందిన చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు. కంచరపాలెం చిత్రాన్ని నిర్మించిన ప్రవీణ పరుచూరి ఈ చిత్రంతో దర్శకురాలిగా మారారు. మరి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుందా, లేదా అనేది చూద్దాం..
కథ:
1997 సమయంలో కొత్తపల్లి అనే ఒక మారుమూల కుగ్రామంలో అప్పన్న (రవీంద్ర విజయ్) అనే వ్యక్తి ప్రజలకు అప్పులు ఇచ్చి వారిని హింసిస్తూ ఉంటాడు. ఇక తన దగ్గరే పనిచేసే కుర్రాడు రామకృష్ణ (మనోజ్ చంద్ర) ఆ ఊరి జమీందార్ రెడ్డి (బెనర్జీ) మనవరాలు సావిత్రి (మౌనిక) ప్రేమలో పడతాడు. చిన్నప్పటి నుండే ఆమెపై ఇష్టాన్ని పెంచుకుంటాడు. అయితే ఈ విషయం ఆమెకు చెబుదాం అనుకునే సమయంలో వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. మరోవైపు అప్పన్న ఆకస్మిక మరణం తర్వాత ఆ ఊరిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? రామకృష్ణ సావిత్రిని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరికి రామకృష్ణ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.
నటీనటుల పర్‌ఫర్మెన్స్:
నటీనటుల్లో డెబ్యూ నటీనటులు తమనటనతో ఆకట్టుకున్నారు. హీరో మనోజ్ చంద్ర (Hero Manoj Chandra) ఉత్తరాంధ్ర మాండలీకంలో మాట్లాడుతూ అలరించాడు. బాడీ లాంగ్వేజ్, లుక్స్ బాగున్నాయి. సినిమాలోని కామెడీ టైమింగ్ కూడా బాగుంది. హీరోయిన్ మౌనిక (Heroine Mounika) తన పాత్రకు న్యాయం చేసింది. నేచురల్ లుక్స్‌తో అదరగొట్టింది. ఉషా బోనెలా కూడా మంచి వినోదం పంచింది. ఆమెపై కామెడీ సీన్స్, ముఖ్యంగా హీరోతో సీన్స్ చాలా ఫన్నీగా సాగాయి.. రవీంద్ర విజయ్ తన మార్క్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. బెనర్జీ, బాబు మోహన్ లాంటి వారు తమ ఎక్స్‌పీరియన్స్ చూపించి అలరించారు.
టెక్నికల్ పర్‌ఫార్మెన్స్:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్(Visual Effects) అంచనాలకు తగ్గట్టు కనిపించకపోయినా, మొత్తం మీద సినిమాకు మైనస్ అయ్యేంతగా అనిపించవు. మణిశర్మ (Mani Sharma) అందించిన పాటలు అందంగా ఉన్నాయ్. వరుణ్ ఉన్ని అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రానికి మంచి ఎమోషనల్ డెప్త్ ఇచ్చింది. పెట్రోస్ అంటోనియాడిస్ కెమెరా పనితనమూ ప్రత్యేకంగా నిలిచింది. కొన్ని ఫ్రేములు నిజంగా అద్భుతంగా అనిపించాయి. ఎడిటింగ్ పరంగా కొంత భాగం చక్కగా ఉన్నా, కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే నరేషన్ మరింత బాగుండేది. డబ్బింగ్ కూడా బాగుంది. ప్రవీణ పరుచూరి విషయానికి వస్తే.. ఆమె ఎంచుకున్న కథ ఓ అందమైన కాన్సెప్ట్‌తో కూడినదే. తన భావనను భావోద్వేగంగా, హాస్యం మేళవించి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని చోట్ల సహజత్వం కొద్దిగా తగ్గినట్టు అనిపించవచ్చు. ముఖ్యంగా కథను మరింత లోతుగా ఎమోషనల్ కాంటెంట్‌తో డిజైన్ చేసి ఉండి ఉంటే కొత్తపల్లిలో ఒకప్పుడు అనే ఈ ప్రయాణం మరింత ఫీల్ గుడ్‌గా అనిపించేది.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల పర్‌ఫార్మెన్స్
కొన్ని సన్నివేశాలు
ఎంచుకున్న పాయింట్
సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్:
విజువల్ ఎఫెక్ట్స్
ఎడిటింగ్
కొన్ని పాత్రలని పెంచితే బాగుండేది
తీర్పు:
కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రం ఊరిలోని మనుషుల స్వభావాలు, చిన్నపాటి సమస్యలు, పెద్దరికాల మధ్య నడిచింది. ఫస్ట్ హాఫ్‌లోనే బెనర్జీ, రవీంద్ర విజయ్ పాత్రల మధ్య జరుగుతున్న విభేదాన్ని క్లియర్‌గా చూపించారు. ఆ విభేదమే తర్వాత కథలో కీలక మలుపుగా మారింది. రామకృష్ణ–సావిత్రిల ప్రేమకథ సింపుల్‌గా, సహజంగా రాశారు. తొలి భాగంలో పెద్దగా లోపాలేం కనిపించవు. కథ సరదాగా సాగుతుంది. అయితే ద్వితీయ భాగంలో కథ మరింత డీప్‌గా మారుతుంది. రామకృష్ణ తన పరిస్థితుల నుంచి ఎలా బయటపడతాడు అనేది ఆసక్తికరంగా చూపించాలి. కానీ అక్కడ డ్రామా వాస్తవికతను కోల్పోయింది. ఊరి ప్రజలు చీదరించుకున్న అప్పన్నకి దేవుడిలా గుడి కట్టడం యథార్థానికి దూరంగా అనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే, కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా బలమైన పాయింట్లతో మొదలై, సహజత్వం కొద్దిగా కోల్పోయినప్పటికీ కొన్ని ఘట్టాల్లో మనసును తాకే విధంగా సాగుతుంది. కానీ మరింత లోతుగా కథను ఇంప్ర వైజ్ చేసి ఉంటే మూవీ మంచి హిట్ అయ్యేది.
నటీనటులు : మనోజ్ చంద్ర, మోనిక టి, ఉష బోనెలా, రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేమ్‌సాగర్
దర్శకురాలు : ప్రవీణ పరుచూరి
నిర్మాతలు : గోపాలకృష్ణ పరుచూరి & ప్రవీణ పరుచూరి
సంగీతం : మణి శర్మ, వరుణ్ ఉన్ని
సినిమాటోగ్రఫీ : పెట్రోస్ అంటోనియాడిస్
కూర్పు : కిరణ్ ఆర్
రేటింగ్ : 2.75/5