అక్షరటుడే, కోటగిరి: Urea | యూరియా పక్కదారి పట్టకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న యూరియాను కొందరు ఇతర పనులకు వాడుతున్నట్లుగా సమాచారం అందుతున్న అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఇందులో భాగంగా పోతంగల్ (Pothangal) మండలం హంగర్గ ఫారం (Hungerga Farm) గ్రామంలో కోళ్ల ఫారాల్లో (chicken farms) యూరియా వాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. కార్యక్రమంలో ఏవో నిషిత, తహశీల్దార్ గంగాధర్, ఎస్సై సునీల్ (SI Sunil), యూత్ అధ్యక్షుడు చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Urea | యూరియా పక్కదారి పడితే చర్యలు
కోళ్లఫారం తనిఖీల అనంతరం అధికారులు మాట్లాడుతూ.. యూరియాను రైతులు పంటసాగుకు మాత్రమే వాడాలని సూచించారు. యూరియా పక్కదారి పట్టిచ్చే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతులు సైతం తమకు సరిపడా యూరియా మాత్రమే తీసుకెళ్లాలని.. స్టోరేజీ కోసం తీసుకెళ్తే ఉపయోగం ఏమీ ఉండదని వివరించారు.