అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. సారంగాపూర్ అర్బన్ పార్క్లో (Sarangapur Urban Park) అటవీశాఖ (Forest Department) ఆధ్వర్యంలో గురువారం వనమహోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలుష్య నివారణకు ఆర్ఎస్ఎస్ (RSS) వంటి సంస్థలు 2018లో దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) పది లక్షలకు పైగా నీడనిచ్చే, ఔషధ మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రధాని మోదీ కూడా అమ్మ పేరు మీద మొక్క నాటాలని పిలుపునివ్వడం జరిగిందని గుర్తు చేశారు.
Mla Dhanpal | అడవులను కాపాడుకుందాం..
అడవులను కాపాడుకుంటూ.. చెట్లను పెంచినప్పుడు మాత్రమే కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతామని ఎమ్మెల్యే తెలిపారు. హిందూ సంస్కృతి ప్రకారం సౌరశక్తిని సూర్యదేవుడిగా.. జలాన్ని గంగాదేవిగా కొలుస్తూ చెట్లను కూడా పూజించే సంస్కృతి ఉందన్నారు.
ఔషధ గుణాలు ఉన్న అరటి, రావి, తులసి, మర్రి, మామిడి, వేప వంటి చెట్లు పెరట్లో పెట్టుకుని పూజించే వాళ్లమని గుర్తు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో డీఎఫ్వో సుధాకర్ (DFO Sudhakar), ఎఫ్ఆర్వోలు సంజయ్, రవి మోహన్, రాధిక, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.